AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parampara 2: పగ కోసం ఎంత దూరం వెళ్లారో తెలియాలంటే ‘పరంపరా 2’ చూడాల్సిందే.. విడుదల తేదీ ఎప్పుడంటే..

Parampara 2: కరోనా మహమ్మారి కారణంగా వినోద రంగంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వెబ్‌ సిరీస్‌లు అంటే కేవలం హాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించేవి కానీ ప్రస్తుతం తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా...

Parampara 2: పగ కోసం ఎంత దూరం వెళ్లారో తెలియాలంటే 'పరంపరా 2' చూడాల్సిందే.. విడుదల తేదీ ఎప్పుడంటే..
Narender Vaitla
|

Updated on: Jun 26, 2022 | 2:50 PM

Share

Parampara 2: కరోనా మహమ్మారి కారణంగా వినోద రంగంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వెబ్‌ సిరీస్‌లు అంటే కేవలం హాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించేవి కానీ ప్రస్తుతం తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్‌ పెరగడంతో ఈ ట్రెండ్‌కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ప్రేక్షకులు సైతం వెబ్‌ సిరీస్‌లకు జై కొడుతున్నారు. వెబ్‌ సిరీస్‌లకు సీక్వెల్స్‌ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వెబ్‌ సిరీస్‌ సీక్వెల్ ప్రేక్షకులను పలకరించడానికి వస్తోంది. గతేడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌ సిరీస్‌లలో ‘పరంపర’ ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది.

నవీన్‌ చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్‌, ఆకాంక్షసింగ్, ఇషాన్‌ వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ పగ, ఆధిపత్యపోరు నేపథ్యంలో తెరకెక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌ విడుదల కానుంది. ‘పరంపర2’ జూలై 21న అందుబాటులోకి రానుంది. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించడం కూడా దీనిపై మంచి బజ్‌ ఏర్పడడానికి కారణంగా చెప్పవచ్చు. ‘పగ కోసం ఎంత దూరం వెళ్లారో తెలియాలంటే పరంపరా 2’ చూడాల్సిందే అంటూ చిత్ర యూనిట్ సీక్వెల్‌ విడుదల తేదీని ప్రకటించింది. ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తాయో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..