DMHO Mahbubnagar Jobs 2022: మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.52,000ల జీతం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Mahbubnagar District) భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి..

DMHO Mahbubnagar Jobs 2022: మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.52,000ల జీతం..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2022 | 8:15 AM

DMHO Mahbubnagar Medical Officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహబూబ్‌నగర్‌ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Mahbubnagar District) భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: పోస్టునుబట్టి నెలకు రూ.10,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office (DMHO), Mahbubnagar, Telangana.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.