Ram Pothineni : ఈ కుర్ర హీరో ఆశలను ఆ ఇద్దరు దర్శకులు నిలబెట్టగలుగుతారా..? 

స్టార్ హీరోగా ఏలడం అంటే అంత సులభం కాదు.. వారసులకైనా వరుస ఫ్లాపులు పడితే కెరీర్ కష్టమే.. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు మాత్రం కొత్త కొత్త కథలను, స్టార్ దర్శకులను నమ్ముకుంటున్నారు.

Ram Pothineni : ఈ కుర్ర హీరో ఆశలను ఆ ఇద్దరు దర్శకులు నిలబెట్టగలుగుతారా..? 
Ram Pothineni
Follow us

|

Updated on: Jun 26, 2022 | 4:00 PM

స్టార్ హీరోగా ఏలడం అంటే అంత సులభం కాదు.. వారసులకైనా వరుస ఫ్లాపులు పడితే కెరీర్ కష్టమే.. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు మాత్రం కొత్త కొత్త కథలను, స్టార్ దర్శకులను నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు కుర్ర హీరో రామ్(Ram Pothineni ). చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ రుచిచూశాడు రామ్ పోతినేని. వరస ఫలపులతో సంతమతం అవుతున్న ఈ యంగ్ హీరోను ఆదుకున్నారు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. పూరి ఇచ్చిన బూస్ట్ తో రెడ్ అనే సినిమా చేశాడు రామ్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో చిన్న గ్యాప్ తీసుకున్న రామ్ ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. వీటిలో లింగు స్వామి డైరెక్షన్ లో వస్తున్న వారియర్ ఒకటి మరొకటి బోయపాటి శ్రీను సినిమా..

ఇప్పుడు ఈ యంగ్ హీరో ఆశలన్నీ ఈ ఇద్దరు దర్శకుల పైనే. పూరి ఇస్మార్ట్ శంకర్ ఇచ్చినా .. నెక్స్ట్ వచ్చిన రెడ్ సినిమా దెబ్బకొట్టడంతో రామ్ కు మళ్లీ ఫ్లాపులు క్యూ కడతాయా అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. ఇక పందెం కోడి , ఆవారా, పందెం కోడి 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యాక్షన్ డైరెక్టర్. ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తున్నాడనే అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే నెక్స్ట్ సినిమా బోయపాటితో చేస్తున్నాడు రామ్. ఇటీవలే అఖండ లంతో సంచలన విజయాన్ని అందుకున్న బోయపాటి రామ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రాసుకొని రెడీగా ఉన్నాడు. అఖండ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. లింగు స్వామి , బోయపాటి సినిమాలు హిట్ అయితే రామ్ స్టార్ హీరోల సరసన చేరిపోతాడు. మరి ఈ యంగ్ హీరో ఆశలను ఈ ఇద్దరు దర్శకులు నిలబెడతారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే