Deepika Padukone: దీపిక పదుకొణె కూతురు ఫేస్ రివీల్.. అచ్చం అమ్మలానే ఎంత క్యూట్‌గా ఉందో.. వీడియో ఇదిగో
ఈ మధ్యన సినిమా సెలబ్రిటీలు తమ బిడ్డల విషయంలో చాలా ప్రైవసీ పాటిస్తున్నారు. చాలా మంది నో ఫొటో పాలసీని అనుసరిస్తున్నారు. అంటే తమ పిల్లల మొహాలను బహిర్గతం చేయకుండా ఉండడం. బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ కూడా ఈ పాలసీనే ఫాలో అవుతున్నారు.. కానీ..

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకొనె – రణ్ వీర్ సింగ్ జంట గతేడాది సెప్టెంబర్ లో అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందారు. వీరి ప్రేమకు ప్రతికగా నటి దీపిక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దువా అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే చాలా మంది సెలబ్రిటీల్లాగానే దీపిక దంపతులు కూడా తమ కూతురి ఫేస్ ను రివీల్ చేయడం లేదు. వీరు కూడా తమ బిడ్డ ప్రైవసీ కోసం ‘నో ఫొటో పాలసీని’ ఎంచుకున్నారు. అంటే తమ పిల్లల మొహాలను బహిర్గతం చేయకుండా ఉండడం. ఈ మధ్యన సెలబ్రిటీల పిల్లల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వాడుతున్నారు కొందరు నెటిజన్లు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు తమ బిడ్డల ముఖాలు కనిపంచకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపికా- రణ్ వీర్ కూడా పాప్స్ కి తమ కూతురి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో దీపిక కూతురు దువాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
ఇటీవల దీపికా తన కూతురితో ఎయిర్ పోర్టులో కనిపించగా.. వీడియో గ్రాఫర్లు ఆమెను వీడియో తీశారు. అయితే ఇది గమనించిన దీపికా తన కూతురు మొహం కనిపించకూడదని వెంటనే రికార్డింగ్ ఆపేయమంది. అలాగే వీడియో తీసిన వ్యక్తిపై చిరాకు పడింది దీపిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రైవసీ కోరుకుంటున్నప్పుడు, దానిని గౌరవించాలని కామెంట్లు పెడుతున్నారు. అలాగే తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కల్కి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన దీపిక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తంది. అట్లీ కుమర్ తెరకెక్కిస్తోన్న ఈ విజువల్ వండర్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఎయిర్ పోర్టులో కూతురు దువాతో హీరోయిన్ దీపికా పదుకొణె..
Deepika Padukone with her newly born baby girl, ‘Dua’ seen today at a private airport! 🥹❤️#DeepikaPadukone #Dua #DuaSinghPadukone pic.twitter.com/kSABA9OBGn
— Bollywood Now (@BollywoodNow) December 9, 2024
దీపికా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







