Dasara Movie: ప్రేక్షకుడు చూడని వెన్నెల ఆవేదన.. ‘దసరా’ మూవీ డిలిటేడ్ సీన్ చూశారా ?..
పూర్తిగా తెలంగాణ యాసలో వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన దసరా చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో కనిపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని చమ్కీల అంగిలేసి పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆయన తెరకెక్కించిన దసరా చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటిరోజే మంచి కలెక్షన్స్ రాబట్టింది. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పూర్తిగా తెలంగాణ యాసలో వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన దసరా చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో కనిపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని చమ్కీల అంగిలేసి పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇటీవల విడుదలైన వెన్నెల మాస్ డాన్స్ వీడియో అయితే నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన వెన్నెల మాస్ డాన్స్ ఓ ఊపు ఉపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన ఓ సన్నివేశాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఇప్పటివరకు ప్రేక్షకుడు చూడని వెన్నెల ఆవేదన చూపించారు. “నిన్నే.. అంత కానిదాన్నైపోయినా.. అడెవడో వచ్చి తాళి కడతాంటే ఆపేది పోయి ఇంక మీదకెళ్లి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నవ్.. నువ్వసలు తల్లివేనా ? ” అంటూ కీర్తి చెప్పే డైలాగ్ తో వీడియో మొదలైంది. అదంరూ కూడా నా బతుకును ఎట్లే చేశిర్రో చూశినవా అని అత్త ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తుంది వెన్నెల.
ఇక వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి.. గిదే నీ ఇల్లు.. ఈడ్నే నీ బతుకు.. నా మాట విని లోపలికి పోవే.. నీ బాంచెనే.. అంటూ వెన్నెలను బతిమాలుకుని వెళ్లిపోతుంది. ఏడుస్తూ అక్కడే నిలబడిపోతుంది వెన్నెల. అయితే వీరి సంభాషణంతా అక్కడే గో వెనక ఉన్న ధరణి వింటుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.