Upasana Konidela: నేను అందంగా లేనన్నారు.. పెళ్లయిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా
అపోలో హాస్పిటల్ డైరెక్టర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన బాడీషేమింగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లయిన కొత్తలో తాను బాడీషేమింగ్‌ను ఎదుర్కొన్నాని తెలిపారు. రామ్‌చరణ్ తనను కేవలం డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడని, తాను అసలు అందంగా లేనని, లావుగా ఉన్నానంటూ చాలా ట్రోల్ చేశారని తెలిపారు.
అపోలో హాస్పిటల్ డైరెక్టర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన బాడీషేమింగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లయిన కొత్తలో తాను బాడీషేమింగ్‌ను ఎదుర్కొన్నాని తెలిపారు. రామ్‌చరణ్ తనను కేవలం డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడని, తాను అసలు అందంగా లేనని, లావుగా ఉన్నానంటూ చాలా ట్రోల్ చేశారని తెలిపారు. ముంబైకి చెందిన ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. చరణ్, తాను కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం అయ్యామని ఉపాసన చెప్పారు. మొదటి నుంచి చరణ్ తనవో ఏదో ఒక చాలెంజ్ చేస్తుండేవాడని, తాను కూడా సవాళ్లు విసిరేదాన్నని తెలిపారు. ఇలా తమ మధ్య ప్రేమ మొదలైందని, తామిద్దరం ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటామని చెప్పారు. తమవి భిన్నమైన కుటుంబ నేపథ్యాలైనప్పటికీ ఎంతో నమ్మంతో తమ బంధాన్ని బలోపేతం చేసుకున్నామన్నారు. ‘‘మనం విమర్శలను స్వీకరించే విధానంలోనే అంతా ఉంటుంది. ట్రోల్స్ వచ్చాయని తాను కుంగిపోకుండా.. వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని జయించానని వివరించారు. తన విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని, తానొక చాంపియన్ లా ఫీల్ అవుతున్నానని తెలిపారు. ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని, తాను ఇప్పుడు మరింత ధైర్యవంతురాలినయ్యానని ఉపాసన చెప్పారు. తనపై విమర్శలు చేసిన వారిని తాను నిందించాలని అనుకోవడం లేదని, వాళ్లకు తన గురించి ఏమీ తెలియదని, అందుకే అలా మాట్లాడి ఉండొచ్చన్నారు. ఈ పదేళ్లలో నా గురించి వారికి తెలిసిందని, ఇప్పుడు తనపై వారి అభిప్రాయం మారిపోయిందని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేదికపై పెళ్లి కొడుకు డ్యాన్స్.. రొమాంటిక్ కానే కాదని..
Mother Dog Love: తల్లడిల్లిన కన్నతల్లి పేగు బంధం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

