Mother Dog Love: తల్లడిల్లిన కన్నతల్లి పేగు బంధం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
కన్నతల్లి ఆప్యాయత అనురాగాలకు సంబంధించిన అమానవీయ వాస్తవ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. తాళ్లగడ్డ ప్రాంతంలో ఒక కుక్క పిల్ల చనిపోయింది. ఫుట్‌పాత్ మీదపడి ఉన్న దానిని కొందరు పక్కనే ఉన్న మ్యాన్ హోల్ గుంతలో వేశారు.
కన్నతల్లి ఆప్యాయత అనురాగాలకు సంబంధించిన అమానవీయ వాస్తవ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. తాళ్లగడ్డ ప్రాంతంలో ఒక కుక్క పిల్ల చనిపోయింది. ఫుట్‌పాత్ మీదపడి ఉన్న దానిని కొందరు పక్కనే ఉన్న మ్యాన్ హోల్ గుంతలో వేశారు. ఈ విషయాలను దూరం నుంచి గమనిస్తున్న తల్లి కుక్క పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. తన కన్న బిడ్డ ఇంకా బతికి ఉందని ఆశతో తన మరో పిల్లతో కలిసి గుంతలో పడిపోయిన కుక్కపిల్లను పైకి లాగటానికి విశ్వప్రయత్నాలు చేసింది. అక్కడే ఉన్న మరికొన్ని కుక్కలు చనిపోయిన కుక్క పిల్ల వైపు వస్తుండడంతో.. తల్లి కుక్క వాటిని అరుస్తూ తరమేసింది. తన పేగు బంధం కోసం ఆరాటపడుతూ గుంత వద్దకు రావడం.. ఆ కుక్కతో పాటు మరో బతికి ఉన్న కూన కూడా తన తోడును చూడడానికి తల్లి వెంట రావడం చూపరులను కంటతడి పెట్టించింది. మనిషైనా.. జంతువైన కన్నతల్లి పేగు బంధానికి ఎవరికైనా ఒకటే అని ఈ దృశ్యం రుజువు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!

