Pakeezah: ఇంట్లో పాచిపని చేస్తానన్న పని ఇవ్వలేదు.. చచ్చిపోదామనుకున్నా.. కన్నీళ్లు పెట్టిన పాకీజా..
లేడీ కమెడియన్ పాకీజా .. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు తినడానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని.. ఇంట్లో పాచిపని చేస్తానని చెప్పినా తనకు పని ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు తనదైన నటన, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ వాసుకి.. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. పాకీజా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఈ పాత్రతో ఫేమస్ అయ్యింది. పాకీజాగా బ్రహ్మానందంతో కలిసి ఆమె చేసిన కామెడీ గురించి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళంలో అనేక చిత్రాలలో నటించినప్పటికీ ఆమె పేరు మాత్రం పాకీజాగానే ఉండిపోయింది. తెలుగులో పెదరాయుడు, రౌడీ ఇన్ స్పెక్టర్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ కమెడీయన్. కానీ ఇప్పుడు మాత్రం జీవించేందుకు సాయం కోసం ఎదురుచూస్తుంది. సంపాదించిన ఆస్తిని పోగొట్టుకుని ఖాళీ చేతులతో.. కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది.
ఇటీవల పాకీజా ధీనస్థితి తెలుసుకున్న సినీప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. ఒక్కొక్కరు తమకు తోచిన సాయం చేశారు. దీంతో ఆమె కష్టాల గట్టెక్కినట్లే అని అనుకునేలోపే తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. ఇప్పటికే పలువురు సినీప్రముఖులు ఆమెకు సాయం చేయగా.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు పూట గడవడమే గగనంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. తాను గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు రూ.7.5 లక్షల దాకా సాయం అందిందని.. ఆ డబ్బు నేను వృథగా ఖర్చు చేయలేదని.. మూడున్నర లక్షల అప్పు తీర్చేసుకున్నాను. హైదరాబాద్ లో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చానని.. వంటసామాగ్రి కొనడం.. ఇక్కడి నుంచి చెన్నై, కారైకూడి, మధురై వెళ్లడం.. ఇలా వీటికే డబ్బంతా అయిపోయిందని చెప్పుకొచ్చింది.
తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళనాడు వెళ్లిపోయానని.. అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయాలు అద్దె కట్టడానికి కష్టమైపోయిందని.. ఇంట్లో పాచిపని చేస్తానని చెప్పినా ఎవరూ పనివ్వడం లేదని.. తాను నటినని దూరం పెడుతున్నారని.. ఆరు నెలల్లో పిచ్చిదాన్నైపోతానేమో అనిపించిందని చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని.. పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేదని.. ఉదయం, సాయంత్రం ఇండ్లీ చేసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..