AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: వరుసగా ప్లాపులు.. ధనుష్‏తో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఈసారైనా హిట్టు కొట్టేనా..?

ఇటీవలే కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్అందుకున్నారు కోలీవుడ్ హీరో ధనుష్. ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అలాగే నాగార్జున, ధనుష్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది.

Dhanush: వరుసగా ప్లాపులు.. ధనుష్‏తో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఈసారైనా హిట్టు కొట్టేనా..?
Dhanush
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2025 | 9:59 AM

Share

కోలీవుడ్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేశారు. ఇటీవలే కుబేర సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషించారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు ధనుష్. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. ఇప్పుడు మరిన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఓ హీరోయిన్ కు ధనుష్ సరసన ఛాన్స్ వచ్చిందట.

ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కడై సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే హిందీలో ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్ మే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు మరొ కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరువడై అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఈ నెల 15న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఇందులో ముందుగా మమితా బైజును ఎంపిక చేసినట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో ధనుష్ జోడిగా పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమవుతుంది పూజా. ఇటీవలే సూర్య జోడిగా రెట్రో మూవీలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా ధనుష్ సరసన ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఈసారి పూజా ఖాతాలో హిట్టు పడడం ఖాయమని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్