Tollywood : ఆ హీరోల సినిమాలకు బిగ్ షాక్.. టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.

బడా సినిమాలకు భారీ షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

Tollywood : ఆ హీరోల సినిమాలకు బిగ్ షాక్.. టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.
Tollywood
Follow us

|

Updated on: Nov 24, 2021 | 3:52 PM

Tollywood : బడా సినిమాలకు భారీ షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని నిర్ణయించింది. అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇక పై చిన్న సినిమా,పెద్ద సినిమా తేడా లేదు…కేవలం నాలుగు షో లు మాత్రమే.. అలాగే అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ను నిర్ణయించింది. గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలు కు పైగా థియేటర్‌లో అమ్మిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అన్ని సినిమాలకు ఒకటే రేటు ఉండనుంది. ఇదిలా ఉంటే రాబోయే సినిమాలన్నీ పెద్ద సినిమాలే.. దాంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, బాలయ్య అఖండ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న ఆరు నెలల్లో బడా సినిమాలన్నీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాగే పుష్ప, ఆచార్య, భీమ్లా నాయక్, అఖండ సినిమాల నిర్మాతలకు, డిస్టిబ్యూటర్స్ కు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కరోనా తర్వాత కోలుకుంటున్న టాలీవుడ్ కు ఒకవిధంగా  చెప్పాలంటే ఇది బిగ్ షాక్. చాలాకాలంగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న బడా సినిమాలకు టికెట్ల రేటుతో  ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: మరోసారి లెహరాయి పాటకు స్టెప్పులేసిన బుట్టబొమ్మ.. హిట్ మూడ్‍లో పూజా హెగ్డే..

ముసిముసి నవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

Jayasudha New Look: షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు