ముసిముసి నవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

సోషల్ మీడియాలో తరచూ తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తూ సినీ సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. లాక్‌డౌన్ నాటి నుంచి...

ముసిముసి నవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine

సోషల్ మీడియాలో తరచూ తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తూ సినీ సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. లాక్‌డౌన్ నాటి నుంచి ఇదొక ఆనవాయితీగా మారింది. ఇక ఫ్యాన్స్ ఏమో తమ అభిమాన నటీనటుల ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తే చాలు.. క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోయిన్ల ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. మరి పైన పేర్కొన్న ఫోటోలో ముసిముసి నవ్వులు నవ్వుతూ.. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ పాలబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!

హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తెలుగునాట క్యామియో రోల్‌తో డెబ్యూ చేసింది ఈ చిన్నది. ఆ తర్వాత నటించిన సినిమాతో కుర్రాళ్ల మనసులను దోచేసింది. వరుసపెట్టి యువ హీరోల పక్కన నటించడమే కాకుండా.. స్టార్ హీరోలతో కూడా జత కట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎవరో కనిపెట్టారా.? చిన్న క్లూ.. తాజాగా ‘అరణ్‌మనై-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుర్తుపట్టేసి ఉంటారు.. ఆమెవరో కాదు రాశి ఖన్నా.

‘మనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశిఖన్నా.. ఆ తర్వాత నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ‘తొలిప్రేమ’, ‘సుప్రీమ్’, ‘జై లవ కుశ’ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అందుకుంది. కాగా, ప్రస్తుతం రాశిఖన్నా ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్ యూ’, ‘సర్దార్’, ‘తిరుచిత్రంబలం’, ‘మేథావి’, ‘షైతాన్ కా బచ్చా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

Click on your DTH Provider to Add TV9 Telugu