Jayasudha New Look: షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో సహజనటి జయసుధ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పద్నాగేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం

Jayasudha New Look: షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..
Jayasudha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2021 | 1:36 PM

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో సహజనటి జయసుధ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పద్నాగేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జయసుధ.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జయసుధ.. ఇప్పటీ స్టార్ హీరోలకు తల్లిగా.. అక్కగా.. బామ్మగా నటిస్తూ.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జయసుధ. గత కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించడం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ.. విదేశాల్లోనే నివసిస్తున్నారు. తాజాగా జయసుధకు సంబంధించిన న్యూలుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోలో జయసుధ ముఖం పూర్తిగా మారిపోయింది. నిండు ముఖంతో కాస్త లావుగా ఉండే.. జయసుధ.. సన్నగా మారిపోయింది. తన ఫోటోను ట్విట్టర్‏లో ఫోటో షేర్ చేస్తూ.. స్మైల్..ఇట్స్ ఫ్రీ థెరపీ అంటూ జయసుధ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు ఆమె ఫోటోను చూసి షాకవుతున్నారు. అయితే కొంతకాలంగా జయసుధ ఆరోగ్యం బాగుండటం లేదని.. అనారోగ్యం కారణంగా.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటే సమాచారం నిజమే అన్నట్టుగా ఉంది.

ట్వీట్..

Also Read: Prabhas: దేశంలోనే నెంబర్ వన్ హీరోగా యంగ్ రెబల్ స్టార్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..

NTR: కొరటాల శివ దర్శకత్వంలో రివేంజ్ డ్రామా.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ఎన్టీఆర్..

Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..

Suma Kanakala New Photos: డ్రెస్ లో మెరిసిన బుల్లితెర స్టార్ మహిళ.. ‘యాంకర్ సుమ’ లేటెస్ట్ ఫోటోలు..