Prabhas: దేశంలోనే నెంబర్ వన్ హీరోగా యంగ్ రెబల్ స్టార్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బహుబలి సినిమాతో

Prabhas: దేశంలోనే నెంబర్ వన్ హీరోగా యంగ్ రెబల్ స్టార్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..
Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు. ఈ మూవీ యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. వెండితెర బాహుబలిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రాలన్ని పాన్ ఇండియా రేంజ్‏లో కావడం విశేషం. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ప్రభాస్ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు.

ఇప్పటికే డైరెక్టర్ రాధకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రాన్ని కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. కేజీఎఫ్ మూవీతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాతోపాటు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో కృతిసనన్, సైఫ్ ఆలీ ఖాన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇవే కాకుండా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే… ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాకు కూడా రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇటీవల ప్రకటించిన స్పిరిట్ చిత్రానికి ఏకంగా రూ. 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు భారతదేశంలో ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫస్ట్ హీరో ప్రభాస్ అని అంటున్నారు సినీ వర్గాలు.. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే డార్లింగ్ సినిమా అప్డేట్స్ పై చర్చ జరుపుతున్నారు.

Also Read: NTR: కొరటాల శివ దర్శకత్వంలో రివేంజ్ డ్రామా.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ఎన్టీఆర్..

Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..

Click on your DTH Provider to Add TV9 Telugu