AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: మరోసారి లెహరాయి పాటకు స్టెప్పులేసిన బుట్టబొమ్మ.. హిట్ మూడ్‍లో పూజా హెగ్డే..

పూజా హెగ్డే.. ఇప్పుడున్న అగ్రకథనాయికలలో ఒకరు. తక్కువ సమయంలోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు

Pooja Hegde: మరోసారి లెహరాయి పాటకు స్టెప్పులేసిన బుట్టబొమ్మ..  హిట్ మూడ్‍లో పూజా హెగ్డే..
Pooja
Rajitha Chanti
|

Updated on: Nov 24, 2021 | 1:58 PM

Share

పూజా హెగ్డే.. ఇప్పుడున్న అగ్రకథనాయికలలో ఒకరు. తక్కువ సమయంలోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. అటు బాలీవుడ్, కోలీవుడ్‏లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే.. ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య మూవీలోనూ కీలక పాత్రలో నటించింది.

ఇక గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్‏గా ఉంటోంది బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే.. తన ప్రతి ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా షూటింగ్ గ్యాప్‏లో క్యారవాన్‏లో లెహరాయి పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆపాటకు పూజా స్టెప్పులేస్తుండగా.. మేకప్ మ్యాన్ వచ్చి హెయిర్ స్ప్రే కొడుతున్న ఈ అమ్మడు మాత్రం డ్యాన్స్ ఆపడం లేదు.

Pooja Hegde

Pooja Hegde

ఇక ఇటీవల అక్కినేని అఖిల్ సరసన పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుట్టబొమ్మ.. బాలీవుడ్ బిగ్ బీ… అమితాబ్ బచ్చన్ పక్కన నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Jayasudha New Look: షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..

Priyanka Chopra: భర్తను ఓ ఆటాడుకున్న ప్రియాంక చోప్రా.. ఒక్క వీడియోతో రూమర్స్‏కు చెక్..

Suma Kanakala New Photos: డ్రెస్ లో మెరిసిన బుల్లితెర స్టార్ మహిళ.. ‘యాంకర్ సుమ’ లేటెస్ట్ ఫోటోలు..

Prabhas: దేశంలోనే నెంబర్ వన్ హీరోగా యంగ్ రెబల్ స్టార్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..