Bhola Shankar: ‘తమ్ముడి పాట మస్తుందిలే’.. పవన్‌ను ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. చిరు లీక్స్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా
చిరు లీక్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో నయా ట్రెండ్. తన ఫ్యాన్స్ కోసం చిన్న గా విషయాన్ని లీక్ చేసి.. ఎవరికీ చెప్పొద్దు... ఇది మనిద్దరి మధ్యనే అంటూ తన స్టైల్‌లో లీక్ చేస్తున్నారు మెగాస్టార్. ఎవ్వరికీ చెప్పం సార్.. జస్ట్ వైరల్ చేస్తామంతే.. అంటూ అదే పని మీద ఉన్నారు ఫ్యాన్స్
చిరు లీక్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో నయా ట్రెండ్. తన ఫ్యాన్స్ కోసం చిన్న గా విషయాన్ని లీక్ చేసి.. ఎవరికీ చెప్పొద్దు… ఇది మనిద్దరి మధ్యనే అంటూ తన స్టైల్‌లో లీక్ చేస్తున్నారు మెగాస్టార్. ఎవ్వరికీ చెప్పం సార్.. జస్ట్ వైరల్ చేస్తామంతే.. అంటూ అదే పని మీద ఉన్నారు ఫ్యాన్స్. నయా లీక్స్ తమ్ముడు గురించి.. ఇక ఆగుతారా మెగా భిమానులు… ఇన్‌స్టంట్‌గా పని మొదలుపెట్టేశారు. 2023 బాగా కలిసొచ్చింది మెగాస్టార్‌కి. సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య గ్రాండ్ హిట్ అయింది. ఇటు మెగా ఇంట వారసురాలు మెగాప్రిన్సెస్ క్లింకారా కొణిదెల రాక సంబరాలు తెచ్చిపెట్టింది. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఆనందంగా ఉన్న మెగా స్టార్ ఫ్యాన్స్ కోసం భోళాశంకర్ నుంచి లీక్ ఇచ్చేశారు. చూశారుగా.. అదీ సంగతి. మెగాస్టారే చెప్పినట్టే… తన సినిమాల స్టైల్‌ని, డ్యాన్స్ మూమెంట్స్ ని తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పట్టుకున్నారు.
అడపాదడపా తన సినిమాల త్రూ ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇచ్చేవారు. ఇప్పుడు అన్నయ్య వంతు వచ్చింది. అదుర్స్ అనిపిస్తున్నారు మెగాబాస్. ఖుషి సినిమాలోని ఏ మేరా జహాన్ పాటలో పవన్ మేనరిజమ్‌ని ఇమిటేట్ చేశారు చిరంజీవి. అంతటితో ఆగకుండా తమ్ముడి పాట మస్తుందిలే అంటూ ఆయన స్క్రీన్ మీద చేసిన సందడి మరో లెవల్‌లో ఉంది అంటున్నారు ఫ్యాన్స్. పనిలో పనిగా ఏ మేరా జహాన్ పాటను కూడా గుర్తుచేసుకుంటున్నారు. గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య మూవీలతో సక్సెస్ మీదున్న చిరంజీవికి భోళాశంకర్ హిట్ చాలా కీలకం. ఈ హిట్ వచ్చేస్తే రీ ఎంట్రీలో లేటెస్ట్ హ్యాట్రిక్ హిట్ అవుతుంది మెగాస్టార్‌కి. ఆల్రెడీ హీరోలను స్టైలిష్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారనే పేరున్న మెహర్ రమేష్ మెగాస్టార్‌ని మరింత స్టైలిష్‌గా చూపిస్తారనే టాక్ కూడా ఉంది. వచ్చే నెల 11న విడుదల కానున్న భోళాశంకర్ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది.
#ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2023
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.