Ameesha Patel: హీరోయిన్ పై నిర్మాత కేసు.. కోర్టు మెట్లెక్కిన బ్యూటీ.. కారణం ఏంటంటే

హే చికిత్సా కొమొస్తాస్ ... అనే లైన్‌ వినగానే ఈమెనే గుర్తుకు వస్తుంది. మహేష్ నాని సినిమా ఫోటో చూడగానే ఈమెనే కనిపిస్తుంది. చూడ్డానికి భలే బావుంటుంది.

Ameesha Patel: హీరోయిన్ పై నిర్మాత కేసు.. కోర్టు మెట్లెక్కిన బ్యూటీ.. కారణం ఏంటంటే
Ameesha Patel
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 01, 2022 | 8:00 AM

“హే చికీతా కొమోస్తాస్” … అనే లైన్‌ వినగానే ఈమెనే గుర్తుకు వస్తుంది. మహేష్ నాని సినిమా ఫోటో చూడగానే ఈమెనే కనిపిస్తుంది. చూడ్డానికి భలే బావుంటుంది. ఇమ్మీడియట్‌ గా తన అందంతో  గుండెల్లో తిష్టేస్తుంది. ఆమె ఎవరో కాదు.. ఆమెనే బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్‌(Ameesha Patel). హృతిక్ కహోనా ప్యార్ హై సినిమాతో.. బీ టౌన్‌లో హీరోయిన్‌గా పాగా వేసిన ఈ బ్యూటీ… ఇప్పుడో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అప్పనంగా.. రెండున్నర కోట్లు నొక్కేసిదంటూ.. ఓ ప్రొడ్యూసర్ తన వ్యాఖ్యలతో అందర్నీ షాక్ చేస్తున్నారు.

అజయ్ కుమార్ అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్… అమీషా పటేల్‌తో.. దేశీ మ్యూజిక్ అనే సినిమా చేయాలనుకున్నారు. అడ్వాన్స్ గా రెండున్నర కోట్లు ఇచ్చారట. కాని కొన్ని కారణాల ఆ సినిమా చేయాని అమీషా.. ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇవ్వకుండా మొఖం చాటేశారట. దీంతో ఫీలైన ఆ ప్రొడ్యూసర్ అప్పట్లోనే ఈమె పై చీటింగ్‌ కేసు పెట్టారు. దీన్ని విచారించిన జార్ఖండ్‌ ట్రయల్ కోర్టు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు జారీ చేసింది. దీంతో ఈ హీరోయిన్ సుప్రీం గడప తొక్కింది. దీంతో సుప్రీం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్స్ జరపాలని పోలీసును ఆదేశించింది. తీర్పు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి