Tollywood: స్కూల్లో టాపర్.. ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ.. చేసిన సినిమాలన్నీ హిట్టైనా రానీ ఆఫర్స్.. ఇప్పుడు..
ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అందం, అభినయంతో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకొస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. కానీ ఈ అమ్మడు స్కూల్లో టాపర్.

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? చిన్నప్పుడు స్కూల్లో టాపర్. అలాగే ఇండస్ట్రీలోనూ గోల్డెన్ బ్యూటీ. తొలి చిత్రంతోనే నటిగా ప్రసంసలు అందుకుంది. ఆ వెంటనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు మారుమోగింది. ఇండస్ట్రీలో వరుస అందుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకుని సినీరంగాన్ని ఏలేస్తుందని అనుకున్నారు. కానీ అలా కాలేదు. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. చిన్నప్పుడు చదువులో టాపర్. ప్రస్తుతం స్కూల్ డేస్ లో పేపర్ యాడ్ లో వచ్చిన ఆమె త్రోబ్యాక్ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో కనిపిస్తోన్న ఆ చిన్నారిని మీరు గుర్తుపట్టగలరా.. ? తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్స్ రాలేదు.
తెలుగులో స్టార్ బ్యూటీగా దూసుకుపోవాల్సిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకొస్తుంది. అంతేకాదు.. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సంయుక్త మీనన్. కొన్ని రోజుల క్రితం ఈ అమ్మడు స్కూల్ డేస్ ఫోటో ఇన్ స్టాలో షేర్ చేసింది. అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ స్కూల్ డేస్ పిక్ పంచుకుంది. తాజాగా ఆ ఫోటోలో ఉన్నది సంయుక్త మీనన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
మలయాళీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన సంయుక్త.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఆ తర్వాత విరూపాక్ష, సార్ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




