Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: కళ్లతోనే మాయచేస్తోన్నఈ అందాలతారను గుర్తుపట్టారా? లేటెస్ట్‌గా చిరంజీవితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుందండోయ్‌..

పై ఫొటోలో కాటుకు కళ్లతోనే మాయ చేస్తోన్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా? టీవీ షోస్‌ రెగ్యులర్‌గా చూసేవారు ఈ అమ్మడిని కనిపెట్టవచ్చు. ఎందుకంటే బుల్లితెరపై ఈ బ్యూటీకున్న క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌. స్టార్‌ యాంకర్‌గా స్మాల్‌ స్క్రీన్‌పై ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో పలు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించింది. ఉదయ్‌కిరణ్‌, సందీప్‌కిషన్‌, సుశాంత్‌, మంచు మనోజ్‌, రామ్ వంటి..

Actress: కళ్లతోనే మాయచేస్తోన్నఈ అందాలతారను గుర్తుపట్టారా? లేటెస్ట్‌గా చిరంజీవితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుందండోయ్‌..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Aug 11, 2023 | 6:14 AM

పై ఫొటోలో కాటుకు కళ్లతోనే మాయ చేస్తోన్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా? టీవీ షోస్‌ రెగ్యులర్‌గా చూసేవారు ఈ అమ్మడిని కనిపెట్టవచ్చు. ఎందుకంటే బుల్లితెరపై ఈ బ్యూటీకున్న క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌. స్టార్‌ యాంకర్‌గా స్మాల్‌ స్క్రీన్‌పై ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో పలు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించింది. ఉదయ్‌కిరణ్‌, సందీప్‌కిషన్‌, సుశాంత్‌, మంచు మనోజ్‌, రామ్ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. అయితే అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. పలు టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. తన అందంతో షోకు గ్లామర్‌ తెస్తూనే, వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. టీవీషోస్‌, సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మకు మూగజీవాలంటే అమితమైన ప్రేమ. వాటికేమైనా అయితే తల్లడిల్లిపోతుంది. ఈపాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్. ఈ అందాల తార మరెవరో కాదు స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌. బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా భోళాశంకర్‌ సినిమాలోనూ నటించింది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది.

కెరీర్‌ ప్రారంభంలో హోళి, థ్యాంక్స్‌, కరెంట్‌, బిండాస్‌, ఎవరైనా ఎప్పుడైనా, గణేష్‌ జస్ట్‌ గణేష్‌ వంటి తెలుగు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించింది రష్మీ. అయితే ఎప్పుడైతే బుల్లితెరపై ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగింది. ముఖ్యంగా జబర్దస్త్‌ తో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. అలాగే సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ఎఫైర్స్‌తోనూ పాపులారిటీ సొంతం చేసుకుంది. టీవీ షోస్‌తో బిజీగా ఉన్నప్పటికీ వెండితెరపై మెరుస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. గతేడాది బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు సినిమాలో కీ రోల్‌ పోషించింది. ఇప్పుడు ఏకంగా భోళాశంకర్‌ సినిమాలో మెరిసింది. ఇవాళే (ఆగస్టు 11) ఈ మెగా మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

చిరంజీవి భోళా శంకర్ లో రష్మీ గౌతమ్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..