AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Arrest: ‘చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 13) బన్నీని అపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఖండిస్తున్నారు.

Allu Arjun Arrest: 'చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు'.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు
Allu Arjun, Harish Rao
Basha Shek
|

Updated on: Dec 13, 2024 | 4:06 PM

Share

అల్లు అర్జున్ అరెస్టు పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. ‘జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సిఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు? రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే?

ఇక బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు న తీవ్రంగా ఖండించారు. ‘అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్.. ఆయన్ను బెడ్ రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది. పుష్ప2 సినిమా విడుదల రోజు క్రౌడ్ విపరీతంగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా? రేవంత్ రెడ్డి చేసే ఇలాంటి పనులు తెలంగాణ రాష్ట్రానికే చెడ్డ పేరు తెస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

హరీశ్ రావు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయిందా? వెంటనే ఇలా చేయండి.!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయిందా? వెంటనే ఇలా చేయండి.!
కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్
కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే