Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

అల్లు అర్జున్ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ సైతం ఐకాన్ స్టార్ అరెస్ట్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్
Varun Dhawan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2024 | 3:58 PM

అల్లుఅర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌ స్పందించారు.  జైపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్‌ ధావన్.. నటుడు ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరని చెప్పారు.  కానీ ఈ ఘటనకు ఒక్కళ్లనే బాధ్యులను చేయటం సరికాదన్నారు.

పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్. ఈ డైలాగ్‌కు తగ్గట్టుగానే మొత్తం దేశం చూపును తనవైపునకు తిప్పుకున్నాడు అల్లు అర్జున్. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన అది కొద్దిరోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టి.. పుష్ప అంటే తగ్గేదేలే అని ప్రూవ్ చేసింది. ఇవన్నీ సినిమా సృష్టించిన రికార్డ్‌లు. బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లిన మైలురాళ్లు.

కానీ ఈ క్రేజీ మూవీ రిలీజ్‌ సమయంలో జరిగిన ఓ ఘటన పుష్ప ఫైర్‌ మిస్‌ ఫైర్ అయ్యేలా చేసింది.హైదరాబాద్ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య ధియేటర్‌ దగ్గర ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ చనిపోయింది. పదేళ్లలోపున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ సంధ్య ధియేటర్‌కు వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరగడంతో.. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ కేసులో ధియేటర్ యాజమాన్యం సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ అంశం పుష్ప 2 సినిమా రేంజ్‌లో సంచలనం సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.. మొత్తం దేశం దీని గురించి చర్చించుకునేలా చేసింది. పుష్ప 2 సినిమాపై ఏ స్థాయిలో ఆసక్తి చూపించిందో.. అల్లు అర్జున్ అరెస్ట్ వార్తలకు సైతం అదే స్థాయిలో కవరేజీ ఇచ్చింది నేషన్ మీడియా. దీంతో హైదరాబాద్‌లో అసలేం జరుగుతోందనే అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి