AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. థియేటర్లలో రచ్చ రచ్చే..

గతేడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. థియేటర్లలో రచ్చ రచ్చే..
Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2025 | 7:45 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంటనే వార్ 2 చిత్రీకరణలో జాయిన్ అయ్యాడు తారక్. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. బీటౌన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో తారక్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని.. అలాగే హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీన్స్ అదిరిపోనున్నాయని టాక్. అలాగే వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ సైతం ఉంటుందని సమాచారం. ఇదంతా పక్కన పెడితే.. వార్ 2 చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్స్ కూడా ఉంటుందని టాక్.

అవును… వార్ 2 చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పుడు శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని..హృతిక్, ఎన్టీఆర్, శ్రద్ధా కాంబోలో ఈ సాంగ్ ఉండనుందని టాక్. శ్రద్ధా మంచి డ్యాన్సర్. ఇప్పటివరకు హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చివరగా స్త్రీ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

నిజానికి శ్రద్ధా కపూర్ పుష్ప 2లోనూ స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉంది. కానీ రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడంతో ఆ సాంగ్ చేయలేదట. దీంతో చివరకు శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు మరోసారి వార్ 2 లో శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ తెరపైకి వచ్చింది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన