- Telugu News Photo Gallery Cinema photos Will Rajamouli stop Telugu movies after that movie and shift to another industry?
Rajamouli: ఆ మూవీ తర్వాత తెలుగు సినిమాలు స్టాప్.! మరో ఇండస్ట్రీకి రాజమౌళి.?
తెలుగు సినిమా రేంజ్‌ని ఇంటర్నేషనల్ డయాస్ మీద సగర్వంగా నిలబెట్టిన రాజమౌళి ఇక సినిమాలు చేయరా? తెలుగు సినిమాలు అసలే చేయరా? ఇప్పుడిదో థౌజండ్ డాలర్స్ క్వశ్చన్. ఎందుకు చేయరు.. అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? అని కంగారు పడుతున్నారు మూవీ లవర్స్.
Updated on: Feb 10, 2025 | 1:22 PM

సినిమాలో హీరో ఎవరైనా, కంటెంట్ ఏదైనా.. బాక్సాఫీస్‌ని బద్ధలు కొట్టే సక్సెస్‌ని ప్రేక్షకులకు అందించడం మాత్రమే తన లక్ష్యంగా ముందుకు సాగే కెప్టెన్ రాజమౌళి. ఇంతింతై వటుడింతై అన్నట్టు... ఆయన సినిమా సినిమాకీ ఎదిగారు. ఆయనతో పాటు, తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ని కూడా పెంచారు.

బాహుబలితో సౌత్ సినిమాలకు నార్త్ గేట్లు పర్మనెంట్‌గా ఓపెన్ అయ్యాయి. ఒకింత తెలుగు సినిమాలను చూసి ఉత్తరాది వారు అలర్ట్ అయ్యే సిట్చువేషన్ క్రియేటైంది. మనం కూడా రాజమౌళిలాగా ముందడుగేద్దాం అని నీల్, అట్లీ లాంటి డైరక్టర్లు డేర్ చేశారు.

ట్రిపుల్ ఆర్‌తో ఇంటర్నేషనల్ డయాస్ మీద తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టారు రాజమౌళి. అప్పటి నుంచి ఆయనతో కొలాబరేట్ కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్. వాళ్లందరితో ట్రావెల్ చేయాలనే కోరిక జక్కన్నకు మాత్రం ఉండదా ఏంటీ? అందుకే మహేష్ సినిమాతో రీజినల్ హీరోల కాంబోకి ఫుల్‌స్టాప్ పెడతారనే మాట వినిపిస్తోంది.

ఎస్ఎస్ఎంబీ29 కోసం ఓ ఓటీటీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నారట జక్కన్న. అందుకే సినిమా ప్రోగ్రెస్‌కి సంబంధించి చిన్న పిక్ కూడా లీక్ చేయడం లేదట. దాదాపు 72 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది సదరు ఓటీటీ.

అంత రిలీజ్ చూశాక... ఆ రేంజ్ అప్లాజ్ అందుకున్నాక జక్కన్న రీజినల్ హీరోలతో సినిమా చేస్తారనే ఆశల్లేవంటున్నారు క్రిటిక్స్. ఆఫ్టర్ ఎస్ఎస్ఎంబీ29.. జక్కన్న కొలాబరేషన్ మొత్తం హాలీవుడ్‌తోనే అన్నది జోరుగా సాగుతున్న ప్రచారం.




