- Telugu News Photo Gallery Cinema photos What is L2 Empuraan promotion plan that impressed with the trailer?
L2 Empuraan: ఎల్2 ఎంపురాన్ ట్రైలర్ ఆకట్టుకుందా.? ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి.?
ఇప్పటిదాకా మలయాళంలో హిట్ అయిన సినిమాలు మన దగ్గర సూపర్ డూపర్ సక్సెస్ కావాల్సిందేగానీ, మేకింగ్ టైమ్ నుంచే అక్కడ ప్రమోషన్ల మీద ఫోకస్ చేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన విషయంలో ఈ ఏడాది తన వంతు ట్రయల్స్ వేస్తున్నారు మోహన్‌లాల్. ఇంతకీ లూసిఫర్ ప్రీక్వెల్ ట్రైలర్ ఎలా ఉంది?
Updated on: Feb 10, 2025 | 1:21 PM

మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెకెక్కిన మలయాళీ బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్. ఈ మూవీ లవర్స్ అందరూ ఖురేషీ కథను వినడానికి ఎప్పటి నుంచో ఇంట్రస్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు దానికి టైమ్ రానే వచ్చింది.

లూసిఫర్‌లో మీరు చూసింది కొంత మాత్రమే.. మిగిలిన కథను మేం చెప్పబోతున్నాం అంటూ ప్రీక్వెల్‌గా రానున్న ఎల్2 ఎంపురాన్ మీద ఎప్పటి నుంచో ఆశలు పెంచేశారు ఈ చిత్ర దర్శకుడు, స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్.

ఆ మాటలకు తగ్గట్టుగానే ఎల్2 ఎంపురాన్ ట్రైలర్ మెప్పిస్తోంది. ఖురేషీ కేరక్టర్‌కి సూపర్‌గా ఫిట్ అయ్యారు మోహన్‌లాల్. కేరక్టర్లను ఎంపిక చేసుకోవడంలో వెర్సటాలిటీ చూపిస్తూ ఎప్పటి కప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ది బాస్ అనిపించుకుంటూ ఉన్నారు మోహన్‌లాల్.

ఎల్2 ఎంపురాన్ ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రీట్ అని ట్రైలర్‌తోనే ఫిక్స్ అయ్యారు మోహల్‌లాల్ ఫ్యాన్స్. ఇప్పటిదాకా కేరళ బౌండరీస్‌లోనే సిక్సర్లు కొట్టిన లాల్ ఏట్టన్, 2025లో ప్యాన్ ఇండియా ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇన్నాళ్లూ పృథ్విరాజ్ సుకుమారన్‌ని ఆర్టిస్ట్‌గా మాత్రమే చూసిన వారు, ఎల్2 ఎంపురాన్‌తో ఆయనలోని నెక్స్ట్ రేంజ్ డైరక్టర్‌ని ప్రశంసించడం గ్యారంటీ అని అంటున్నారు క్రిటిక్స్. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ఆల్రెడీ ముందంజలో ఉంది ఎల్2 ఎంపురాన్.




