AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగు డైరెక్టర్ ఆఫర్ కావాలంటే కమిట్మెంట్ ఇమ్మన్నాడు.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.

సినీరంగంలో నటీమణులు లైంగిక వేధింపులు ఎదురవుతుంటాయని చాలాసార్లు విన్నాం. ఇదివరకే ఎంతో మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా బయటపెట్టారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలోని మహిళల రక్షణ కోసం మీటూ ఉద్యమం నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలువురు మహిళా ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Tollywood: తెలుగు డైరెక్టర్ ఆఫర్ కావాలంటే కమిట్మెంట్ ఇమ్మన్నాడు.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.
Mita Vashisht
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2024 | 8:45 AM

Share

సినీరంగంలో మహిళలకు లైంగిక వేధింపులు అనేది ప్రధాన సమస్య. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ ఇస్తామని కొందరు దర్శకనిర్మాతలు మాట్లాడతారని ఇదివరకే చాలా మంది మహిళలు తమ సమస్యలు బయటపెట్టారు. అలాగే పలువురు హీరోయిన్స్ సైతం కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ నటి మితా వశిష్ట్ కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టారు. తెలుగు పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనతో అసభ్యంగా మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను చెన్నై ఫిల్మ్ పెస్టివల్ కు హాజరయ్యానని.. గది నుంచి తాను బయటకు రాకుండా ఆ చిత్రనిర్మాత తను బంధించాడని.. కానీ తనతో నవ్వుతూ మాట్లాడుతూనే తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది.

ది లాలాన్‌టాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మితాకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందా అని అడగ్గా.. ఆమె మాట్లాడుతూ.. “ఒక తెలుగు దర్శకుడు తన సినిమాలో నాకు లీడ్ రోల్ ఇచ్చాడు. అతడి ముందు సినిమాలో నటించిన నటి జాతీయ అవార్డ్ గెలుచుకుంది. దీంతో అతడు నాకు ప్రధాన పాత్ర ఆఫర్ చేయడంతో నేను ఒప్పుకున్నాను.. కానీ సినిమా చేయాలంటే అతడితో రెండు నెలలు జీవించాలని అన్నాడు. కానీ అతడికి ఇంగ్లీష్ సరిగ్గా రాలేదని నేను అనుకున్నాను. భాష నేర్చుకోవడానికి రెండు నెలలు సమయం చెప్పాడని నేను అనుకున్నాను.. అదే విషయాన్ని అడిగాను. కానీ అలాంటిదేమి లేదని.. కేవలం తనతో గడపాలి అన్నాడు. అతడి మాటలు విని షాకయ్యాను. నాకు ఆ రోల్ వద్దని చెప్పి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాను. అతడు అడ్డుపడ్డాడు. ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది.

‘ఆ డైరెక్టర్ ఆఫర్ చేసింది ప్రధాన పాత్ర కావచ్చు.. అతడు స్టార్ డైరెక్టర్ కావచ్చు.. కానీ నేను పెద్దగా పట్టించుకోను.. నాకు నటన కళ ఇష్టమే కానీ.. ప్రతి సమస్యను తీసుకోలేము.. నేను చాలా మంది గొప్ప దర్శకులతో పనిచేశాను. ప్రతి సినిమా షూటింగ్ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. నా గౌరవం. నా రూల్స్ ప్రకారం వాళ్లకు కావాల్సిన విధంగా ముందుకు వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.