AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్‏బాస్ హౌస్‏లో కుప్పకూలిన కంటెస్టెంట్.. ఆందోళనలో హౌస్మేట్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఫ్యామిలీ వీక్ పూర్తైన సంగతి తెలిసిందే. మరోవైపు హిందీ, కన్నడ, తమిళంలోనూ ఈ షో రన్ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే గమనించిన బిగ్ బాస్.. మిగత కంటెస్టెంట్స్ సాయంతో ఆమెను చికిత్స అందించారు.

Bigg Boss: బిగ్‏బాస్ హౌస్‏లో కుప్పకూలిన కంటెస్టెంట్.. ఆందోళనలో హౌస్మేట్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2024 | 8:06 AM

Share

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు మంచి క్రేజ్ ఉంటుంది. ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ షో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం భాషలలో ఈ రియాల్టీ షో విజయవంతంగా రన్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 నడుస్తుండగా.. హిందీలో సీజన్ 18న నడుస్తుంది. అలాగే కన్నడలోనూ ఇటీవలే బిగ్‏బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలో పెయిర్ టాస్క్ జరిగింది. అయితే కాసేపటికే కంటెస్టెంట్ చైత్ర కుందాపూర్ కుప్పకూలింది. బాత్రూమ్ ఏరియాలో ఒంటరిగా ఉన్న సమయంలో చైత్య స్పృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన బిగ్‏బాస్ వెంటనే మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన మోక్షితా పాయ్, గౌతమి జాదవ్‌లను బాత్రూమ్ ఏరియాలోకి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. దీంతో ఇద్దరు పరుగున వెళ్లి చూసేసరికి చైత్ర కుందాపుర స్పృహతప్పి పడిపోయి కనిపించింది. దీంతో హౌస్ లోని ఇతర కంటెస్టెంట్స్ కూడా బాత్రూమ్ ఏరియాలోకి పరిగెత్తారు. చైత్రను మాములు స్థితికి తీసుకురావడానికి అందరూ ఎంతో ప్రయత్నించా ఆమెకు స్పృహ రాలేదు.

అపస్మారక స్థితిలో ఉన్న చైత్ర కుందాపూర్ ముఖంపై నీళ్లు చల్లారు. అయినా ఆమె స్పృహలోకి రాకపోవడంతో ఆమెను వెంటనే కన్ఫెషన్ రూమ్‌కి తీసుకురావాలని ఆదేశించాడు బిగ్‏బాస్. దీంతో ఆమెను ఎత్తుకుని కన్ఫెషన్ రూమ్‌కు తీసుకెళ్లాడు కంటెస్టెంట్ త్రివిక్రమ్. ప్రస్తుతం చైత్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్‏బాస్ హౌస్ లో నిత్యం ఏదోక టాస్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎనర్జిటిక్ గా ఉండడం చాలా ముఖ్యం. అయితే చైత్ర స్పృహ కోల్పోవడానికి కారణమేమిటనేది తెలియాల్సి ఉంది. ఇటీవలో హౌస్ లో పెయిర్ టాస్క్ జరిగింది. ఇదిలా ఉంటే.. మొన్నటి ఎపిసోడ్‌లో చైత్ర కుందాపూర్, శిశిర్ మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.