AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: నమ్మినవాళ్ళే నామినేట్ చేశారు.. ఇనయా ఎమోషనల్

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలను మొదలుపెట్టేశాడు బిగ్ బాస్.. ఇందులో భాగంగా ఇనయను నామినేట్ చేశారు రోహిత్ మెరీనా ..

Bigg Boss 6 Telugu: నమ్మినవాళ్ళే నామినేట్ చేశారు.. ఇనయా ఎమోషనల్
Bigg Boss Inaya
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2022 | 9:31 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలను మొదలుపెట్టేశాడు బిగ్ బాస్.. ఇందులో భాగంగా ఇనయను నామినేట్ చేశారు రోహిత్ మెరీనా .. దాంతో తెగ ఫీల్ అయిపోయింది ఇనయా.. తన టీమ్ లో వాళ్లే సిల్లీ రీజన్ కు తనను నామినేట్ చేశారని బాధపడింది ఇనాయ. నామినేట్ చేసిన తర్వాత ఇనాయ దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చింది మెరీనా.. ఆ తర్వాత రోహిత్ కూడా వచ్చి సారి చెప్పాడు. దాంతో ఇనయా.. నన్ను ఎవరు నామినేట్ చేసినా పెద్దగా బాధపడలేదు.. ఐ డోంట్ కేర్.. అనుకున్నా.. కానీ మీరు ఏం చేసినందుకు బాధపడ్డాను అని చెప్పింది ఇనయ. అయితే పక్కనే ఉన్న ఫైమా మాత్రం రోహిత్ మెరీనాలకు చురకలాంటించింది.  మన టీంలో ఉండి ఎవరూ తీసుకోలేని స్టాండ్ తాను తీసుకుని ధైర్యంగా వెళ్లింది. మనం చెప్పాం కనుక ఆమె చేసింది.. దానికి నామినేట్ చేయడం ఏంటి అని రోహిత్, మెరీనాలకు ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేసింది.

ఆ తర్వాత వాసంతి దగ్గర కూర్చుని గ్రూప్‌లో ఉండి ఎవరి గేమ్ వాళ్లు ఆడుకున్నారు.. నేను మాత్రం గ్రూప్ గెలవాలని ఆడాను. అందుకే చెడ్డదాన్ని అయిపోయాను అని తెగ బాదపడిపోయింది ఇనయ. ఇక ఆదిరెడ్డి మరోసారి రివ్యూ మొదలు పెట్టాడు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే టాపిక్ లేపాడు ఆదిరెడ్డి. ఈసారి ఎలిమినేషన్ చాలా టఫ్ గా ఉంటుంది.. ఎవరైనా హౌస్ నుంచి బయటకు పోవచ్చు. సూర్య, రేవంత్, గీతు, శ్రీహాన్ ఈ నాలుగురు తప్ప ఎవరైనా పోవచ్చు అని రేవంత్‌తో చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. ఇనయ కూడా వెళ్లదని రేవంత్ అనడంతో.. అవును ఆమె కూడా ఎలిమినేట్ కాదు అని అన్నాడు ఆదిరెడ్డి. రేవంత్ మాట్లాడుతూ.. పైకి ధైర్యంగానే ఉన్నా.. నాకు కూడా భయంగా ఉందని అని అన్నాడు. దానికి నువ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నావ్..నిన్ను ఎలిమినేట్ చేయరు అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. మరోసారి సూర్య, ఆరోహిలు మరోసారి హగ్గులతో రచ్చచేశారు. తనతో క్లోజ్ గా ఉండటం లేదు అని ఆరోహి తెగ ఫీల్ అయిపోయింది.

దానికి సూర్య నువ్వుకూడా వేరేవాళ్లతో క్లోజ్ గా ఉంటున్నావ్ గా అంటూ కౌంటర్ ఇచ్చాడు. వెంటనే నీకు ఇద్దరు కనెక్ట్ అయ్యారు.. నాకు నలుగురు కనెక్ట్ అయ్యారు అంతే అని సూర్య అనడంతో .. ఆరోహి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆరోహి తిరిగి సూర్య దగ్గరకు వచ్చి.. నేను నిన్ను ఎలా చూస్తా.. మిగిలిన వాళ్లని ఎలా చూస్తా.. నేను నలుగురు ఐదుగురికి తినిపించినా నీకు తినిపించేప్పుడు ఉండే ఎఫెక్షన్ నాకు ఒక్కడికే తెలుసు. నిన్ను తప్ప నేను ఎవర్నీ నమ్మను అని అన్నావ్ కదా ఆరోహీ.. నాకు నువ్వు అదే అని అన్నారు సూర్య. దీంతో ఆరోహి సర్లే అయిపోయింది కదా అంటూ టాపిక్ ను కట్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.