AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: అప్పుడు చైన్ పట్టుకుని వచ్చాను.. ఇప్పుడు కత్తి పట్టుకొని వస్తున్నా : నాగార్జున

నాగార్జున ఇప్పుడు గోస్ట్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Nagarjuna: అప్పుడు చైన్ పట్టుకుని వచ్చాను.. ఇప్పుడు కత్తి పట్టుకొని వస్తున్నా : నాగార్జున
Nagarjuna The Ghost
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2022 | 9:15 PM

Share

నాగార్జున ఇప్పుడు గోస్ట్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘ఈ వేదిక పై నేను, చైతు, అఖిల్ ఇంత ప్రేమని అభిమానాన్ని  అందుకుంటున్నామంటే..  దానికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలపాలి. తెలుగు సినీ పరిశ్రమ, మా నాన్న గారు అక్కినేని నాగేశ్వరరావు గారు. మీ ప్రేమ అభిమానం చూడటానికే చైతు, అఖిల్ ని ఇక్కడికి రమ్మన్నాను. 33 ఏళ్ల కిందట అక్టోబరు 5న ‘శివ’ అనే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పుడు చైన్ పట్టుకుని వచ్చాను. అదే అక్టోబరు 5న కత్తి పట్టుకుని వస్తున్నాను. ది ఘోస్ట్ కూడా  ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. విజయదశమి అందరికీ విజయాన్నిస్తుందని అంటారు. ఈ పండగ మాకు కూడా విజయాన్నిస్తుందని నమ్ముతున్నా. మీ అందరికీ నచ్చి మెచ్చుతారని అనుకుంటున్నాను అన్నారు.

‘ది ఘోస్ట్’ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి యాక్షన్, డ్రామా అంటే ఇష్టం. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమా తీశారు. శివ సమయంలో సౌండ్స్ గురించి మాట్లాడారు.  ది ఘోస్ట్ లో ఎఫెక్ట్స్, మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. నేను చాలా సినిమాల్లో గన్స్ వాడాను. కానీ ఈ సినిమా కోసం నాతో పాటు హీరోయిన్ సోనాల్ కి కూడా పదిహేను రోజుల పాటు మిలటరీ ట్రైనింగ్ ఇప్పించారు ప్రవీణ్ సత్తార్. సోనాల్ కాలు కూడా ఇరిగింది. ఈ ఏడాది ఆరంభంలో నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల ముందుకొచ్చా. అది థియేటర్లలో ఎంతగానో ఆదరణ పొందింది. ఓటీటీ, టెలివిజన్లలో రికార్డులు సృష్టించింది. దానికి వచ్చిన టీఆర్పీ ఈ ఏడాది ఏ సినిమాకీ రాలేదు. త్వరలో అఖిల్ తో కలిసి నటిస్తున్నా. ‘అన్నమయ్య’ సినిమా సమయంలో కర్నూలుకి వచ్చాను. నరసింహ స్వామికి దండం పెట్టుకున్నాను. బసవన్న ముందు డ్యాన్స్ చేశాను. మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. ఘోస్ట్ అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది. నన్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో ‘ది ఘోస్ట్’లో అలాగే కనిపిస్తా. నేను యాక్షన్ సినిమా చేసి చాలా రోజులైయింది. చాలా కష్టపడి చేశాం. ప్రేక్షకులంతా చూసి ఆదరిస్తారనే గొప్ప నమ్మకంతో ఉన్నాం. నాకెంతో ఆప్తులైన చిరంజీవి గారి  సినిమా కూడా విజయదశమికి విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.