Bigg Boss 6: మరోసారి రచ్చ చేసిన గీతూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చిన హౌస్‌మేట్స్

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) మూడో వారం కూడా అదే రేంజ్ లో గొడవలు, గోలలు, ఏడుపులు, అరుపులతో గందరగోళంగా సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ రసావత్రరంగా మారింది

Bigg Boss 6: మరోసారి రచ్చ చేసిన గీతూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చిన హౌస్‌మేట్స్
Bigg Boss6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2022 | 7:27 AM

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) మూడో వారం కూడా అదే రేంజ్ లో గొడవలు, గోలలు, ఏడుపులు, అరుపులతో గందరగోళంగా సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ రసావత్రరంగా మారింది. హౌస్ లో ఒకొక్కరు ఇద్దరు నామినేషన్ చేయాలి. ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పాలి అని ఆదేశించాడు బిగ్ బాస్. దాంతో హోస్ లో రెడ్ కలర్ ను పంపించి ఆ రంగును నామినేట్ చేసిన వల్ల మొఖానికి రాయాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో రచ్చ మొదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియకు ముందు ఆరోహి, రాజ్ మధ్య ఓ చిన్న యుద్ధమే జరిగింది. రాజ్ చెప్పేది ఆరోహికి.. ఆరోహి చెప్పేది రాజ్ కు మాత్రమే కాదు.. ఈ ఇద్దరు ఏం చెప్తున్నారో జనాలకు కూడా అర్ధంకాలేదు. దాంతో ఇద్దరి మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది. ఇక నామినేషన్స్ లో మొదట శ్రీ సత్య.. ఆరోహిని నామినేట్ చేసింది. పడుకుని.. పడుకోలేదని రాజ్‌తో గొడవపడటం తనకి నచ్చలేదని చెప్పింది శ్రీ సత్య. ఆ తరువాత ఇనయని నామినేట్ చేసింది. తనను వరస్ట్ పర్ఫార్మర్ అని ఎలా డిసైడ్ చేస్తారు అంటూ శ్రీసత్య అనడంతో ఇనాయ పెద్ద డిస్కషన్ పెట్టింది. దాంతో ఇద్దరు అరుచుకుంటూ హడావిడి చేశారు.

ఇక గీతూ నామినేషన్ మొదలు పెట్టకముందే నేహాతో గొడవకు దిగింది. సంచాలక్‌గా ఆమె సరిగా చేయకపోవడం వల్లే గేమ్ డిస్ట్రబ్ అయ్యిందని చెప్పుకొచ్చింది. కానీ ఆమెను నామినేట్ చేయకుండా సుదీపను నామినేట్ చేసింది గీతూ.. దానికి కారణంగా బేబీల గురించి ఎమోషనల్ జర్నీ జరుగుతున్నప్పుడు.. ఏడ్చి టిష్యూలు అక్కడే విదిలేసిందని అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది గీతూ..అలాగే ఆమె రియల్ గా ఉండటంలేదని చెప్పింది.. దానికి సుధీప గట్తిగానే కౌంటర్ ఇచ్చింది.. ఇంత సిల్లీ రీజన్‌ని నువ్ నామినేట్ చేశావంటే నీ బుద్ధి ఎలాంటిదో అర్ధమైందని అంది సుదీప. రెండో నామినేషన్ చంటిని చేసింది.. బయట ఒకలా ఉండి.. ఇక్కడ కెమెరాల ముందు ఒకలా ఉంటూ.. రియల్‌గా ఉండటం లేదని చెప్పింది. తాను కూర చేశాననే రీజన్‌తో చంటి తినలేదని నామినేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన చంటి గీతూని నామినేట్ చేశాడు. అంతే కాదు గీతూకి ఇవ్వాల్సిన క్లాస్ ఇచ్చాడు. సంస్కారం ఉండాలంటూ గీతూకి కౌంటర్ ఇచ్చాడు చంటి.. అయినా వినకుండా ఆయనతో గొడవకు దిగింది గీతూ.. అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ కాదని.. చంటి అనడంతో.. ఆర్గ్యుమెంట్ కూడా గేమ్‌లో భాగం అని.. అందరితో గొడవలు పెట్టుకోవడానికి తనకి తీట లేదని చెప్పింది గీతు. ఇక్కడ ఎవరికీ తీట లేదని చంటి కౌంటర్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..