Mahesh Babu: మహేష్ సినిమా కోసం ఆ సీనియర్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్నారా.?

ఇప్పుడు అందరి చూపు  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాపైనే.. దాదాపు పుష్కర కాలం తర్వత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Mahesh Babu: మహేష్ సినిమా కోసం ఆ సీనియర్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్నారా.?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2022 | 6:47 AM

ఇప్పుడు అందరి చూపు  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాపైనే.. దాదాపు పుష్కర కాలం తర్వత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు త్రివిక్రమ్ కూడా అల వైకుంఠపురం సినిమా తర్వాత భీమ్లానాయక్ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందించి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మహేష్ కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసి రంగంలోకి దిగుతున్నారు. మొనీమద్యే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు గురూజీ. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఓ సీనియర్ నటిని సంప్రదిస్తున్నారట. మాములుగా త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ నటులను తీసుకుంటూ ఉంటారు. నదియా, కుష్బూ, టబు లాంటి హీరోయిన్స్ ను తన సినిమాలో పవర్ ఫుల్ లేడీ పాత్రల్లో చూపించారు త్రివిక్రమ్. ఇక మహేష్ సినిమాలో కూడా లాంటి పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను సంప్రదిస్తున్నారట. రమ్యకృష్ణ ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత జోరుపెంచిన రమ్యకృష్ణ రీసెంట్‌గా లైగర్ సినిమాలో నటించి మెప్పించారు. ఇక మహేష్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో.. అసలు ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..