Mahesh Babu: ‘ఆ కారణంతోనే మహేష్ ఏమాయ చేసావే మూవీ రిజెక్ట్ చేశాడు’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్..

తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న గౌతమ్ తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ అపేడ్ట్స్ ఇచ్చారు. అంతేకాకుండా అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేసావే సినిమా కథను

Mahesh Babu: 'ఆ కారణంతోనే మహేష్ ఏమాయ చేసావే మూవీ రిజెక్ట్ చేశాడు'.. ఆసక్తికర కామెంట్స్ చేసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 19, 2022 | 7:43 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన.. తెలుగులో ఘర్షణ, ఏమాయ చేశావే వంటి హిట్ సినిమాలను రూపొందించారు. ఇక ఇటీవల విడుదలైన అందమైన ప్రేమకావ్యం సీతారామం మూవీలో కీలకపాత్రలో కనిపించారు. అంతేకాకుండా పలు చిత్రాల్లో విలన్ పాత్రలలోనూ నటిస్తున్నారు. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న గౌతమ్ తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ అపేడ్ట్స్ ఇచ్చారు. అంతేకాకుండా అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేసావే సినిమా కథను ముందుగా మహేష్ బాబుకు (Mahesh Babu) వినిపించినట్లు చెప్పారు.

ఏమాయ చేసావే కథను ముందుగా మహేష్ బాబుకు చెప్పాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని ముందుగా మంజులకు చెప్పడంతో.. స్టోరీ బాగుంది కానీ మహేష్ ఒకే చెస్తాడు అనేది అనుమానమే.. ఒకసారి చెప్పి చూడండి అంటూ ముందే సలహా ఇచ్చిందట. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకు చెప్పగా.. చిన్న స్టోరీ కదా ?.. మనమిద్దరం కలిసి చేస్తున్నామంటే అంచనాలు వేరేలా ఉంటాయ్ కదా ? ఏదైనా యాక్షన్ కథ చెద్దాం అని అన్నాడట. దీంతో ఏమాయ చేసావే స్టోరీ నాగచైతన్య వద్దకు వెళ్లింది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. ఒక డీసెంట్ మూవీని మహేష్ మిస్ చేసుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి.