Tollywood: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఒక్కరోజే ఎనిమిది చిత్రాలు రిలీజ్..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ నాగశౌర్య, శ్రీవిష్ణు, తమన్నా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
సినీ ప్రియులకు ఈవారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ సినీతారలు. ఇప్పటికే పలు చిత్రాలు దసరాకు విడుదలయ్యేందుకు సిద్ధంకాగా.. మరిన్ని సినిమాలు పండగకు ముందే థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అలరించనున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ నాగశౌర్య, శ్రీవిష్ణు, తమన్నా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనీశ్ ఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఇందులో షెర్లీ కథానాయికగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
ఇక టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ అల్లూరి. డైరెక్టర్ ప్రదీప్ వర్మ రూపొందిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
అలాగే సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న సినిమా దొంగలున్నారు జాగ్రత్త. ఇందులో సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో కాలభైరవి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇక మాతృదేవోభవ సినిమా సెప్టెంబర్ 24న విడుదల అవుతుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బబ్లీ బౌన్సర్. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అందోర్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 21న, ద కర్జాషియన్స్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 22న స్ట్రీమింగ్ కానున్నాయి.
ఆహా.. ఇక ఆహాలో ఫస్ట్ డే ఫస్ట్ షో సెప్టెంబర్ 23న.. డైరీ తమిళ్ సినిమా సెప్టెంబర్ 23న స్ట్రీమింగ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్.. అమెజాన్ ప్రైమ్‌లో హిందీ సిరీస్ ‘డ్యూడ్’ సెప్టెంబర్ 20న, హుష్ హుష్ హిందీ సిరీస్ సెప్టెంబర్ 22న స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ5.. అతిథి భూతో భవ హిందీ సిరీస్ సెప్టెంబర్ 22న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్.. ఇక నెట్ ఫ్లిక్స్ లో ద పెర్ ఫ్యూమర్ సిరీస్.. హాలీవుడ్ సెప్టెంబర్ 21న, జంతరా సిరీస్, ఎల్వోయూ హాలీవుడ్ సెప్టెంబర్ 23న స్ట్రీమింగ్ కానున్నాయి.