Ponniyin Selvan: మణిరత్నం మదిలో మహారాణి నందినిగా ముందు ఉన్నది  ఆమెనే.. ఐశ్వర్య స్థానంలో ఉండాల్సిన హీరోయిన్ ఎవరంటే..

ఇందులోని మహారాణి నందిని పాత్ర కోసం ముందుగా ఎంచుకున్నది ఐశ్వర్యను కాదట. ముందు ఆయన మదిలో ఈ పాత్రల కోసం మరో హీరోయిన్ ఉందట. కానీ అనుహ్య కారణాల వల్ల ఐశ్వర్యను సంప్రదించాడట మణి.

Ponniyin Selvan: మణిరత్నం మదిలో మహారాణి నందినిగా ముందు ఉన్నది  ఆమెనే.. ఐశ్వర్య స్థానంలో ఉండాల్సిన హీరోయిన్ ఎవరంటే..
Aishwarya
Follow us

|

Updated on: Sep 19, 2022 | 6:12 PM

చాలా కాలం తర్వాత డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తోన్న సినిమా పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). ఇందులో ఐశ్వర్యరాయ్ (Ponniyin Selvan), త్రిష, కార్తి, శోభితా ధూళిపాళ్ల, విక్రమ్ చియాన్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మణిరత్నం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులోని మహారాణి నందిని పాత్ర కోసం ముందుగా ఎంచుకున్నది ఐశ్వర్యను కాదట. ముందు ఆయన మదిలో ఈ పాత్రల కోసం మరో హీరోయిన్ ఉందట. కానీ అనుహ్య కారణాల వల్ల ఐశ్వర్యను సంప్రదించాడట మణి.

పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్ర కోసం వేరే ఎవరినైనా సంప్రదించారా ? అని విలేకరి అడగ్గా.. అవునన్నారు. ముందుగా ఈ పాత్ర కోసం సీనియర్ నటి రేఖను అనుకున్నారట. ఈ పాత్ర కోసం నేను వేరే నటీనటులను దృష్టిలో పెట్టుకోలేదు. 1994లో పొన్నియన్ సెల్వన్ తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఈ పాత్ర కోసం నేను ముందుగా సీనియర్ నటి రేఖను అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో రజినీ మాట్లాడుతూ.. నందిని పాత్రలో తాను హీరోయిన్ రేఖను అనుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రముఖ కవి కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.