Anushka Shetty: మరోసారి అరుంధతిని గుర్తుచేసిన అనుష్క.. ఆకట్టుకుంటున్న జేజమ్మ పోస్ట్..
లేటేస్ట్ ప్రోఫైల్ ఫోటోతో మరోసారి అరుంధతిని గుర్తుచేసింది అనుష్క. అందులో చీరకట్టు.. బంగారు ఆభరణాలు.. పెద్ద బొట్టుతో ఎంతో అందంగా
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది అనుష్క (Anushka Shetty). ఈ మూవీ అనంతరం ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. అంతేకాకుండా చాలా రోజులుగా సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది అనుష్క. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలో అనుష్క ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. చాలా కాలం తర్వాత అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తాజాగా తన ఇన్ స్టా ప్రోపైల్ మార్చేసింది. లేటేస్ట్ ప్రోఫైల్ ఫోటోతో మరోసారి అరుంధతిని గుర్తుచేసింది అనుష్క. అందులో చీరకట్టు.. బంగారు ఆభరణాలు.. పెద్ద బొట్టుతో ఎంతో అందంగా కనిపిస్తున్న అరుంధతి చిత్రంలోని జేజమ్మ పాత్ర ఫోటోను తన ప్రోఫైల్ పిక్ గా మార్చేసింది. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. నవీన్ పోలిశెట్టి, అనుష్క కాంబోలో రాబోతున్న మూవీపై ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి డైరెక్టర్ మహేష్ పి దర్శక్తవం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఓ కుర్రాడు తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయి ప్రేమలో పడడం.. ఆ తర్వాత వారిద్ధరి జీవితంలో ఎదురైన సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా కోసం అనుష్క మరోసారి బరువు పెరిగినట్లుగా టాక్ వినిపిస్తోంది. అందుకే ఆమె తన లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదంటూ వార్తలు నడుస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి.