Prabhas: “ప్రభాస్ రేంజ్ చూసి తట్టుకోలేకే”.. డార్లింగ్ పై బాలీవుడ్ దుష్ప్రచారం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)పేరు ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తోంది. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా ప్రయాణం కొనసాగుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)పేరు ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తోంది. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా ప్రయాణం కొనసాగుతోంది. డార్లింగ్ అంటే పడిచచ్చిపోయే ఫ్యాన్స్ దేశవిదేశాల్లో ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమా వస్తుందట అన్ని ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అనే చెప్పాలి. అందుకు ఉదాహరణ సాహూ సినిమా.. ఈ మూవీ మనదగ్గర పర్లేదు అనిపించుకున్న బాలీవుడ్ లో మాత్రం బంపర్ హిట్ అయ్యింది. వసూళ్లను కూడా అదే రేంజ్ లో రాబట్టింది. అక్కడ సినిమాలకు ధీటుగా డార్లింగ్ సినిమా వసూళ్లు రాబట్టడంతో బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత రాధేశ్యామ్ సినిమాకూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సలార్ , ఆదిపురుష్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. దాంతో బాలీవుడ్ లో చిన్నపాటి గందరగోళం మొదలైంది. ప్రభాస్ ను ఆపడం కష్టం అనుకున్నారో ఏమో దుష్ప్రచారం మొదలు పెట్టారు కొందరు బాలీవుడ్ ప్రేక్షకులు..
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రస్తుతం ప్రభాస్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్, హీరోయిన్ గా కృతిసనన్ ను ఎంపిక చేశారు. షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. అయితే తాజాగా ప్రభాస్-కృతి సనన్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ప్రభాస్, కృతి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ షోలో కృతి ప్రభాస్ కు ఫోన్ చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవలే పెద్దనాన్న ను కోల్పోయిన బాధలో ప్రభాస్ ఉంటే.. బాలీవుడ్ ఇలా దుష్ప్రచారం చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మా హీరో రేంజ్ చూసి ఏడుస్తూ.. ఇంత దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి, ఆయన ఫ్రెండ్ షిప్ నేచర్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.