Rajinikanth: సూపర్ స్టార్ సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్.. కారణం ఇదేనా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వశిస్తున్న ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నెల్సన్ ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వశిస్తున్న ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నెల్సన్ ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తమిళ నట మంచి టాక్ తెచుకున్నప్పటికీ మనదగ్గర మాత్రం పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఓ అదిరిపోయే కథతో రజినీతో సినిమా చేస్తున్నారు నెల్సన్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన సూపర్ స్టార్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ పెట్టడంతో ఈ మూవీ ఖాదీల నేపథ్యంలో ఉంటుందని అర్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి ఇప్పుడు హీరోయిన్ తప్పుకుందన్న వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
జైలర్ సినిమాలో హీరోయిన్‌గా ముద్దుగుమ్మ ప్రియాంక అరల్ మోహన్ ను ఎంపిక చేశారు. ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. అయితే ప్రియాంక అరుళ్ మోహన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. దర్శకుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఈ సినిమానుంచి తప్పుకుందాని అంటున్నారు. గతంలో నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ అనే సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ తో గొడవ కారణంగా ఆమె సూపర్ స్టార్ సినిమానుంచి తప్పుకుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. రజినీకాంత్ సినిమా ఛాన్స్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు.. అలాంటిది ప్రియాంకకు తక్కువ టైంలోనే ఈ ఆఫర్ రావడం అంటే అదృష్టమనే చెప్పాలి. అలాంటి ఛాన్స్ ను అమ్మడు వదులుకుంటుందా.. చూడాలి మరి ఏం జరుగుతుందో..