Niharika Konidela: గంగూబాయ్ అవతారమెత్తిన మెగా డాటర్.. నెట్టింట ట్రెండ్ అవుతోన్న కాస్ట్యూమ్ పార్టీ ఫొటోలు..
Niharika Konidela: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సినిమా సెలబ్రిటీల్లో మెగా డాటర్ నిహారిక కొణెదల ఒకరు. సినిమాలు, వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. ఇక పార్టీల్లో రెగ్యులర్‌గా పాల్గొనే నిహారిక...
Niharika Konidela: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సినిమా సెలబ్రిటీల్లో మెగా డాటర్ నిహారిక కొణెదల ఒకరు. సినిమాలు, వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. ఇక పార్టీల్లో రెగ్యులర్‌గా పాల్గొనే నిహారిక ఆ ఈవెంట్స్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పుటిప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో డిఫ్రంట్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కొందరు యూట్యూబర్స్‌తో పాటు కంటెంట్ క్రియేటర్స్ కలిసి పాల్గొన్న కాస్ట్యూమ్ పార్టీలో నిహారిక హల్చల్ చేసింది. క్యాస్టూమ్ పార్టీ అంటేనే డిఫ్రెంట్ గెటప్‌లో హాజరుకావడం. ఈ పార్టీకి నిహారిక గంగూబాయ్ లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ముంబైకి చెందిన లేడీ డాన్ గంగూబాయ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో గంగూబాయ్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్ గంగూబాయ్ పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించి మెప్పించింది. ఇందులో వైట్ శారీలో నుదుట బొట్టుతో ఆకట్టుకుంది.
క్యాస్టూమ్ పార్టీలో అచ్చంగా అలియాలా రడీ అయిన నిహారిక ఆకట్టుకుంది. ఇక నిహారిక భర్త చైతన్య ఈ పార్టీకి వకీల్‌సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్‌లో హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..