AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Soniya: మూడు నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు.. ఏం చేసిందో తెలుసా? వీడియో

బిగ్ బాస్ తెలుగు ఫేమ్, ప్రముఖ నటి సోనియా ఆకుల గతేడాది అమ్మగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఓ పండంటి ఆడబిడ్డను ప్రసవించిన ఆమె శిఖ వీరగోని అని పేరు పెట్టుకుంది. అయితే ఈ పాపు పుట్టి మూడు నెలలు కాలేదు అప్పుడే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.

Bigg Boss Soniya: మూడు నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు.. ఏం చేసిందో తెలుసా? వీడియో
Bigg Boss Soniya Akula
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 8:20 AM

Share

సాధారణంగా మూడు నెలల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? నేలపై పాకడం, బోర్లా పడటం, నవ్వడం వంటి చిన్న చిన్న పనులు నేర్చుకునే దశలో ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల, యష్ వీరగోని దంపతుల గారాల పట్టి ‘శిఖ వీరగోని’ మాత్రం అప్పుడే గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక వరల్డ్ రికార్డులను ఖాతాలో వేసుకుని చిన్న వయసులోనే సంచలనం సృష్టించింది. శిఖ వీరగోని, కేవలం 3 నెలల 29 రోజుల వయసులోనే ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అదేంటంటే.. ‘లాంగెస్ట్ డ్యూరేషన్ బై యాన్ ఇన్ఫాంట్ మెయింటైనింగ్ అసిస్టెడ్ అప్రైట్ బ్యాలెన్స్ ఆన్ ఏ పేరెంట్స్ పామ్’ (నాన్న అరచేతిపై నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ నిలబడటం) అనే విభాగంలో ఈ రికార్డు సాధించింది శిఖ. తన తండ్రి అరచేతిపై ఏకంగా 2 నిమిషాల 43 సెకన్ల పాటు నిలబడి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది శిఖ. కేవలం గిన్నిస్ రికార్డు మాత్రమే కాదు, ఈ చిన్నారి ఏకకాలంలో ఐదు ప్రధాన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శిఖ స్థానం దక్కించుకుంది.

బహుశా ఇంత చిన్న వయసులో ఇన్ని రికార్డులు సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావచ్చేమో. అందుకే తమ కూతురి రేర్ ఫీట్ ను చూసి సోనియా దంపతులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారి ‘శిఖ’ చేసిన ఈ రేర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిన్నారి తన తండ్రి అరచేతిపై నిలబడి, ఆయన కళ్లలోకి చూస్తూ నవ్వుతున్న తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది. శిఖ ఈ వయసులో ఇంత బ్యాలెన్స్ డ్ గా నిలబడటం చాలా అరుదైన విషయం అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇది నిజంగానే అద్భుతం’, ‘ఇంత చిన్న వయసులో ఇంత టాలెంటా?’ అంటూ సోనియా కూతురికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురితో బిగ్ బాస్ సోనియా దంపతులు..

View this post on Instagram

A post shared by Soniya Akula (@soniyaakulaa)

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
3 నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు
3 నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో
ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో
తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో చరిత్ర.. ఎవరీ సాకిబ్ హుస్సేన్ ?
తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో చరిత్ర.. ఎవరీ సాకిబ్ హుస్సేన్ ?
బరువు తగ్గాలనుకుంటున్నారా?ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి!
బరువు తగ్గాలనుకుంటున్నారా?ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..