AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైలేజ్‌ ఎక్కువ రావాలంటే కారు ఎంత స్పీడ్‌లో నడపాలో తెలుసా?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన ఆదాకు సరైన కారు వేగం ముఖ్యం. గంటకు 80-95 కిలోమీటర్లు ఆదర్శం. అధిక వేగం (70 మైళ్ల పైన) గాలి నిరోధకత వల్ల ఇంధన వినియోగాన్ని 9-25 శాతం పెంచుతుంది. తక్కువ వేగం, తప్పు గేర్‌లు కూడా మైలేజీని తగ్గిస్తాయి.

మైలేజ్‌ ఎక్కువ రావాలంటే కారు ఎంత స్పీడ్‌లో నడపాలో తెలుసా?
Fuel Efficiency Tips
SN Pasha
|

Updated on: May 16, 2026 | 9:30 PM

Share

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు మైలేజీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. చాలా మంది వేగంగా వెళ్తే సమయం ఆదా అవుతుందని భావించినా, అధిక వేగం ఇంధన ఖర్చును గణనీయంగా పెంచుతుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. సరైన వేగంతో కారు నడిపితే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు గంటకు 80 నుంచి 95 కిలోమీటర్ల వేగం అత్యంత అనుకూలం. ఈ వేగంలో ఇంజిన్‌పై అధిక ఒత్తిడి ఉండదు. అలాగే గాలి నిరోధకత కూడా తక్కువగా ఉండటంతో ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది.

అయితే వేగం గంటకు 110 కిలోమీటర్లకు చేరిన తర్వాత ఇంధన వినియోగం వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 110 కిలోమీటర్ల వేగంలో దాదాపు 9 శాతం ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని అంచనా. అదే 130 కిలోమీటర్ల వేగంతో నడిపితే ఇంధన వినియోగం 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గాలి నిరోధకత. వాహనం వేగం పెరిగే కొద్దీ గాలి ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు ఇంజిన్‌ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్‌ లేదా డీజిల్‌ వినియోగం పెరుగుతుంది.

అదే సమయంలో చాలా తక్కువ వేగంతో ఎక్కువసేపు డ్రైవ్‌ చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గేర్‌లో ఎక్కువసేపు వాహనం నడిస్తే ఇంజిన్‌ ఆర్‌పీఎం పెరిగి ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి వాహనం వేగం పెరిగిన వెంటనే సరైన గేర్‌లోకి మార్చడం అవసరం. హైవేపై క్రూయిజ్‌ కంట్రోల్‌ ఉపయోగించడం కూడా ఇంధన ఆదాకు దోహదపడుతుంది. ఇది వాహనాన్ని ఒకే వేగంతో నడిపేలా చేస్తుంది. తరచూ బ్రేక్‌లు వేయడం, ఒక్కసారిగా వేగం పెంచడం తగ్గిపోవడంతో ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల విషయానికి వస్తే, గంటకు 65 నుంచి 80 కిలోమీటర్ల వేగం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేగంలో బ్యాటరీపై ఒత్తిడి తగ్గి, రేంజ్‌ మెరుగుపడే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!