AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీలో హై వోల్టేజ్ పోరు.. రౌండ్ 2 సమరంలో ఐటీ దిగ్గజాల హోరాహోరీ!

TV9 Corporate Badminton Tournament: ప్రతిష్టాత్మక 'టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్' కోర్టులో సరికొత్త చరిత్రకు తెరలేచింది. కార్పొరేట్ ప్రపంచంలో బిజీ లైఫ్‌తో తలమునకలయ్యే ఉద్యోగులు రాకెట్ పట్టి మైదానంలోకి దిగడంతో ఆట పతాక స్థాయికి చేరింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీమ్ ఈవెంట్ రెండో రౌండ్ సమరం ముగియడంతో, టోర్నమెంట్ మూడో రౌండ్, ప్రీ-క్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16) వైపు సగర్వంగా దూసుకెళ్లింది.

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీలో హై వోల్టేజ్ పోరు.. రౌండ్ 2 సమరంలో ఐటీ దిగ్గజాల హోరాహోరీ!
Tv9 Corporate Badminton Championship Day 2
Venkata Chari
|

Updated on: May 16, 2026 | 9:35 PM

Share

TV9 Corporate Badminton Tournament: కార్పొరేట్ ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ ఒక యుద్ధాన్ని తలపించింది. కేవలం గెలవాలనే పట్టుదలే కాకుండా, తమ సంస్థ కీర్తిని నిలబెట్టాలనే కసి ఆటగాళ్ల ప్రతి షాట్‌లోనూ స్పష్టంగా కనిపించింది. ఆఫీసు డెస్క్‌లకే పరిమితమయ్యే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మేనేజర్లు కోర్టులో ప్రదర్శించిన వేగం, చురుకుదనం ప్రేక్షకులను సైతం అబ్బురపరిచాయి. గెలుపోటములను పక్కనబెట్టి అద్భుతమైన క్రీడా స్ఫూర్తితో సాగిన ఈ మ్యాచ్‌లు టోర్నమెంట్ స్థాయిని మరింత పెంచాయి.

మూడో రౌండ్ పోరులో గ్లాన్స్-ఇన్‌మోబి, ఇన్ఫోసిస్ జోరు..

టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లలో ఐటీ రంగ దిగ్గజాలు తమ సత్తా చాటాయి.

గ్రూప్ L: పెగాసిస్టమ్స్ ఇండియాపై ఫిన్‌మార్కెట్-2 జట్టు వాకోవర్ ద్వారా విజయం సాధించి తదుపరి దశకు చేరింది.

గ్రూప్ M: పల్స్ ఫార్మాస్యూటికల్స్ జట్టు 2-0 తేడాతో ఫిన్‌మార్కెట్-4పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మెక్రో గ్రూప్‌పై అమెజాన్ హైదరాబాద్-13 జట్టు వాకోవర్‌తో ముందంజ వేసింది.

గ్రూప్ N: డిలాయిట్ జట్టుపై ఇన్ఫోసిస్ బ్రేవ్ హార్ట్స్ 2-0 తేడాతో ఘనవిజయం సాధించి కోర్టులో తమకు తిరుగులేదని నిరూపించింది. మేక్ మై ట్రిప్‌పై డెల్ ఛాలెంజర్స్ వాకోవర్ సాధించింది.

గ్రూప్ O: శ్రీదేవి ఉమెన్స్ కాలేజీపై ష్రోడింజర్ టీమ్-2 వాకోవర్ పొందగా, గ్రీన్కో జట్టుపై పల్ని ఇంక్ 2-0 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

ప్రీ-క్వార్టర్స్‌లో మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ జట్ల అమీతుమీ..

రెండో రౌండ్ దాటుకుని వచ్చిన జట్లు రౌండ్ ఆఫ్ 16 (ప్రీ-క్వార్టర్స్) లో తలపడటంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.

గ్లాన్స్-ఇన్‌మోబి జట్టు కాగ్నిజెంట్‌ను 2-0 తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్ రేసులో నిలిచింది.

టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మైక్రోసాఫ్ట్ రేంజర్స్ జట్టు పల్ని ఇంక్‌పై 2-0తో ఘన విజయం సాధించి టోర్నమెంట్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించింది.

ఎంతో ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్‌లో బ్రాండ్ మేకింగ్ స్ట్రాటజీస్ (BMS) జట్టు 2-0 తేడాతో ష్రోడింజర్ ఇండియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రౌండ్ 2 ముగిసేసరికి పోటీ మరింత తీవ్రంగా మారింది. రాబోయే క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కార్పొరేట్ వేదికపై సాగుతున్న ఈ బ్యాడ్మింటన్ పండుగ క్రీడాభిమానులకు అసలైన వినోదాన్ని పంచుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us