AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs GT IPL 2026 Result: బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన కేకేఆర్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్‌

Kolkata Knight Riders vs Gujarat Titans, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 60వ ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

KKR vs GT IPL 2026 Result: బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన కేకేఆర్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్‌
Kkr Vs Gt
Venkata Chari
| Edited By: |

Updated on: May 16, 2026 | 11:44 PM

Share

Kolkata Knight Riders vs Gujarat Titans, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 60వ ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫిన్ అలెన్, అంగక్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్ అర్ధ సెంచరీలు సాధించి KKRకు భారీ విజయాన్ని అందించారు. గుజరాత్ టైటాన్స్ తరఫున ముగ్గురు బ్యాట్స్‌మెన్లు కూడా అర్ధశతకాలు సాధించారు. సాయి సుదర్శన్, జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్ అర్ధశతకాలు సాధించినప్పటికీ గుజరాత్ విజయంలో విఫలమైంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌పై తమ అత్యధిక స్కోరైన 247 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం 248 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ సైతం గట్టిగానే పోరాడింది. కేకేఆర్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టినప్పటికీ, నిర్ణీత ఓవర్లలో 218 పరుగులకే పరిమితమైంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానానికి చేరుకునే మార్గంలో ఉంది. అయితే, కోల్‌కతా విజయం శుభ్‌మన్ గిల్ జట్టు విజయ పరంపరకు గండికొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 247 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్‌కు ఇది మూడవ అత్యధిక స్కోరు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us