అబ్రకదబ్ర.. అద్భుతమైన డ్రింక్.. ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగితే ఏ రోగమైనా ఇట్టె పరార్..
సోంపు గింజలు కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం కూడా. ప్రతిరోజూ సోంపు లేదా సోంపు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా మలబద్ధకం, బరువు పెరుగుదల, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల బలానికి కూడా సోంపు ఎంతో మేలు చేస్తుంది.

సోంపు గింజలను (ఫెనల్ సీడ్స్) తరచుగా జీర్ణక్రియకు సహాయపడే మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే చూస్తారు. అయితే, ఈ గింజలు అద్భుతం.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. సోంపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి ఎన్నో ఇతర అద్భుతాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.. సోంపు గింజల్లో అధిక మొత్తంలో పీచు పదార్థం (ఫైబర్) ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలోకి వెళ్ళాక నీటిని పీల్చుకొని, జీర్ణరసాలతో కలిసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు భోజనంతో సంబంధం లేకుండా రోజులో ఎప్పుడైనా సోంపును నమలవచ్చు. అయితే, చక్కెరలో ముంచిన సోంపు గింజలకు దూరంగా ఉండాలి. అవి జీర్ణక్రియను నిలిపివేసి, డయాబెటిస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ప్లెయిన్ సోంపు గింజలు – చిన్నవి లేదా పెద్దవి – ఏదైనా తీసుకోవచ్చు.. ఉదాయన్నే సోంపు గింజల నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
గుండె ఆరోగ్యానికి సోంపు చాలా మంచిది. ఇది రక్తనాళాల్లో బ్లాకేజీలు రాకుండా చూసి, గుండె సమస్యలను నివారిస్తుంది. పాలు పడని తల్లులకు సోంపు గింజలు ఒక వరం. వీటిని నమలడం ద్వారా లేదా కషాయం రూపంలో తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. నువ్వులు, బెల్లం కలిపి ముద్దగా చేసి కూడా తీసుకోవచ్చు. సంతానోత్పత్తి సమస్యలు, హార్మోనల్ అసమతుల్యత ఉన్నవారికి కూడా సోంపు గింజలు ప్రయోజనకరం. వీటిలోని ఒక మూలకం ఈస్ట్రోజన్‌లా పనిచేసి సంతానోత్పత్తికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి సోంపు ఒక అద్భుతమైన పరిష్కారం.. భోజనానికి అరగంట ముందు కొన్ని సోంపు గింజలు తిని, ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకొని కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది కేలరీల తీసుకోవడం తగ్గించి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. సోంపు మెటబాలిక్ రేటును పెంచి, ఫ్యాట్ బర్నింగ్‌కు కూడా సహాయపడుతుంది.
సొంపు గింజలు రక్తపోటును నియంత్రిస్తాయి.. ఎందుకంటే ఇవి శరీరంలో యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల కళ్ళ ఆరోగ్యానికి, కంటి జబ్బులు రాకుండా నివారించడానికి సోంపు ప్రయోజనకరం. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెగ్నీషియం, జింక్ వంటి మైక్రో న్యూట్రియంట్స్ శరీరంలోని అంతర్గత క్రియలను మెరుగుపరుస్తాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరును కూడా సోంపు మెరుగుపరుస్తుంది. ఇది డయూరేటిక్‌గా పనిచేసి మూత్రవిసర్జనను క్రమబద్ధీకరిస్తుంది. ప్రాస్టేట్ గ్రంధి పెరుగుదల (ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్) వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు కషాయం తాగడం మేలు చేస్తుంది.
మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేయడమే కాకుండా, సోంపు గింజలను నెమ్మదిగా నమలడం వల్ల దంతాలకు మంచి వ్యాయామం, శుభ్రత లభిస్తుంది. ఇది స్కేలింగ్ ఏర్పడకుండా చూస్తుంది, దవడ కండరాలను బలోపేతం చేసి దవడలు జారిపోకుండా కాపాడుతుంది. ధనియాల పప్పుతో కలిపి సోంపు గింజలను తీసుకోవడం వల్ల వాటిలోని కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి, జీర్ణక్రియకు మాత్రమే కాకుండా, అనేక సాధారణ ఆరోగ్య ప్రయోజనాల కోసం సోంపు గింజలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం..
అయితే.. సొంపును తినొచ్చు.. లేదా సోంపు నానబెట్టిన నీటిని తాగవచ్చు.. ముందుగా సోంపును రాత్రి ఓ గ్లాసు నీటిలో చెంచా సోంపు వేసి నానబెట్టి పరగడుపున తాగాలి.. నీటితోపాటు.. నానిన సోంపు గింజలను సైతం తినొచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
