AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి ఇంట్లో ఈడీ రెయిడ్స్ వివరాలు ఎందుకు బయటకు రాలేదు? ఏం మాయ చేశారు..?

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన 'క్రాస్‌ఫైర్' ఇంటర్వ్యూలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిజాలు వెల్లడించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ రెయిడ్స్, కుటుంబ వ్యాపారాలపై ఆయన సూటిగా స్పందించారు. వివరాలు బయటకు రాకుండా మేనేజ్ చేశారన్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు.

మంత్రి ఇంట్లో ఈడీ రెయిడ్స్ వివరాలు ఎందుకు బయటకు రాలేదు? ఏం మాయ చేశారు..?
Ponguleti On Ed Raids
Balaraju Goud
|

Updated on: May 16, 2026 | 8:46 PM

Share

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిజాలు వెల్లడించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ రెయిడ్స్, కుటుంబ వ్యాపారాలపై ఆయన సూటిగా స్పందించారు.

తన ఇంట్లో జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) సోదాల వివరాలు బయటకు రాకుండా మేనేజ్ చేశారన్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. “చట్టాన్ని మేనేజ్ చేయడం ఎవరికైనా సాధ్యమా? నా ఇంట్లో ఎలాంటి అక్రమ సొమ్ము దొరకలేదు కాబట్టే అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఏమైనా దొరికి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు నన్ను వదిలిపెట్టేవా?” అని ఆయన ప్రశ్నించారు.

మంత్రిగా ఉన్న పొంగులేటి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’కు రూల్స్ విరుద్ధంగా కాంట్రాక్టులు ఇస్తున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ.. రాఘవ కంపెనీ ఈరోజు పుట్టింది కాదు, దశాబ్దాలుగా ఓపెన్ టెండర్లలో పాల్గొంటూ, అర్హతతోనే ప్రాజెక్టులు దక్కించుకుంటోంది. ఇందులో ఎలాంటి రూల్స్ ఉల్లంఘన లేదు” అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానమిస్తూ.. “గతంలో సైకిళ్ల మీద తిరిగిన వాళ్లకు ఇప్పుడు లక్షల కోట్లు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. 30 శాతం కమీషన్లు తీసుకునేది మేము కాదు, గత పాలకులు” అని పొంగులేటి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వారి అవినీతిని బయటకు తీస్తుంటే, విపక్ష నేతలు భయపడి కోర్టుల నుండి స్టేలు తెచ్చుకుంటున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కక్షతో కూడినవేనని ఆయన కొట్టిపారేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us