ప్రమాదమే.. వీరికి గ్రీన్ టీ విషంతో సమానం, తాగితే కష్ట నష్టాలే!

samatha

16 may 2026

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇది కొంత మందికి అస్సలే మంచిదాకాదంట.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తాగడం వలన ఇది గుండె, మెదడు పనితీరుకు చాలా మేలు చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్

అయితే గ్రీన్ టీ వలన అనేక లాభాలు ఉన్నప్పటికీ కొంత మందికి ఇది విషంతో సమానం. కాగా, అసలు గ్రీన్ టీ ఎవరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వీరికి విషంతో సమానం

గ్రీన్ టీలో కెఫిన్, టానిన్లు , కొన్ని రకాల యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది ఒక్కో శరీరంపై ఒక్కో ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల సమస్యలకు కారణం అవుతుంది.

కెఫిన్, టానిన్లు

నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు దీనికి దూరం ఉండటం మంచిది. కొన్ని సార్లు ఇది ఆందోళన, నిద్ర లేమికి కారణం అవుతుంది.

నిద్రలేమి

గర్భిణీలు, తల్లిపాలు ఇస్తున్నవారు కూడా టీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. లేకపోతే ఇది మీ బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందంట.

గర్భిణీలు, తల్లిపాలు ఇచ్చేవారు

అలాగే యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్యలు ఉన్నవారు, అలాగే రక్తం పలచబడే మందులు వాడే వారు కూడా వీలైనంత వరకు గ్రీన్ టీకి దూరం ఉండాలి.

యాసిడ్ రిఫ్లక్షన్