Bigg Boss Telugu 9: బిగ్ బాస్ స్టేజ్ పై అదరగొట్టిన నాగార్జున, అమల.. ఆర్జీవీ పంచ్‌లు హైలైట్
నిన్నటి ఎపిసోడ్ లోనూ భరణి కోసం దివ్య, తనూజ మధ్య బీభత్సమైన వార్ జరిగింది. దీంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది తనూజ. అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్కులో చివరిగా రీతూ, తనూజ, ఇమ్మూ మిగిలారు. ఆ సమయంలో కెప్టెన్ దివ్య డెసిషన్ తీసుకోవాల్సి రావడంతో ఆమె తనూజ పేరు చెప్పింది.

బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. వారాంతం వస్తే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీతో అదరగొడుతున్నారు. శనివారం హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకునే నాగార్జున ఆదివారం హౌస్ మేట్స్ తో ఆటలాడించి, పాటలు పాడించి ఒకరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చేస్తారు.. తాజాగా బిగ్ బాస్ నుంచి ప్రోమో విడుదల చేశారు. ఈ నెలలో శివ మూవీ రిలీజ్ ఉండటంతో.. నాగార్జున శివ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది అంటూ ఆ సినిమా పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగ్. నాగ్ తో సర్ ప్రైజింగ్ గా అమల కూడా స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. నాగ్, అమల డాన్స్ తో మెప్పించారు. ఆతర్వాత హౌస్ మేట్స్ కూడా శివ సినిమాలోని సాంగ్స్ కు డాన్స్ చేశారు.
36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాం.. ఇప్పుడు మళ్లీ ఈ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నాం అని కింగ్ నాగార్జున అన్నారు. ఆతర్వాత ఆనందో బ్రహ్మా సాంగ్‌కి తనూజ, కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు. అలాగే దివ్య, ఇమ్మాన్యుయేల్ కూడా డాన్స్ చేశారు. ఆతర్వాత డెమాన్ పవన్, రీతూలు కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కు డాన్స్ చేశారు. పవన్, రీతూలు డాన్స్ చూసి అమల మురిసిపోయారు. ఆతర్వాత రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అని రాము రాథోడ్ రామ్ గోపాల్ వర్మను అడగ్గా.. చాలా సాడ్ గా ఫీల్ అయ్యా.. స్టుపిడ్ క్వచ్ఛన్ అని అనేశారు. ‘రాములోని రాము బయటకు వచ్చారు అని నాగ్ అన్నారు. నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజులు ఉంచితే ఉంటావా? అని నాగార్జున అడిగారు. అందరూ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటాను అని వర్మ తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.




