AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suma Kanakala: విడాకుల పై స్పందించిన సుమ.. లైఫ్ ఎవరికీ సాఫీగా ఉండదు అంటూ

బుల్లితెర యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల. కొన్నేళ్లుగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంటూ టాప్ యాంకర్‎గా దూసుకుపోతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా.. టీవీ షోస్ అయిన సుమ కచ్చితంగా ఉండాల్సిందే. పంచులు, ప్రాసలతో ఆడియన్స్‏ను నవ్విస్తూ వినోదాన్ని అందించడంలో సుమ స్టైలే వేరు..

Suma Kanakala: విడాకుల పై స్పందించిన సుమ.. లైఫ్ ఎవరికీ సాఫీగా ఉండదు అంటూ
Suma Kanakala
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2025 | 6:46 PM

Share

యాంకర్ సుమ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. రియాల్టీ షోస్ చేస్తూ టాప్ యాంకర్‏గా కొనసాగుతుంది. యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు సుమ. సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల ఎంతో అన్యుణ్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో ఈ ఇద్దరి బంధంపై రూమర్స్ వచ్చాయి.. సుమ , రాజీవ్ విడిపోతున్నారంటూ.. వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని గాసిప్స్ వచ్చాయి. దీని పై గతంలోనే సుమ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి సుమ విడాకులు అంటూ వస్తున్న వార్తల పై స్పందించారు. తాజాగా ఓ పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న సుమ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి సుమ మాట్లాడారు.

సుమ మాట్లాడుతూ.. తనకు వచ్చే కలలు నిజం అవుతాయని తెలిపారు. నాకు వచ్చే కలలు నిజం అవుతాయి.. ఒకసారి మేం గుడికి వెళ్లినట్లు కల వచ్చింది. ఆతర్వాతి రోజు అనుకోకుండా అదే గుడికి వెళ్లాం.. ఆ తర్వాత విమానం కూలినట్లు కల వచ్చింది. ఆ కల నిజం అవుతుందేమోనని చాలా రోజులు విమానం ఎక్కాలంటే భయపడిపోయాను అని తెలిపింది సుమ.  ఒకసారి రాజీవ్‌కు షూటింగ్‌లో యాక్సిడెంట్ అయ్యిందని. ఆ ప్రమాదంలో తన కాలు విరిగినట్లు కల వచ్చింది. అప్పట్లో ఫోన్‌లు లేవు.. ల్యాండ్‌లైన్‌లో మాట్లాడాలి. రాజీవ్‌ ఆ టైంలో తలకోనలో ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఒక రోజంతా రాజీవ్ తో మాట్లాడటం కుదరలేదు.. నాకు భయం వేసింది. తర్వాత ఫోన్‌ చేసినప్పుడు ‘నువ్వు బానే ఉన్నావా?’ అని అడిగితే.. ‘ఎందుకు అలా అడుగుతున్నావు?’ అన్నాడు. నాకు ఇలా ఓ కల వచ్చింది అని చెబితే.. ‘నిజంగానే నాకు కాలు విరిగింది. షూటింగ్‌లో  నేను డ్రైవ్ చేస్తున్న కారు చెట్టుని ఢీకొట్టింది. నా కాలు విరిగింది అని చెప్పాడు. దాంతో నేను అక్కడికి వెళ్లి రాజీవ్ ను హాస్పటల్ లో చేర్పించా.. అని చెప్పారు సుమ.

అలాగే విడాకుల రూమర్స్ పై కూడా సుమ మాట్లాడారు.. మా పెళ్లి జరిగి 25 సంవత్సరాలు అవుతోంది. ఒక రిలేషన్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. రాజీవ్‌ కెరీర్‌, నా కెరీర్‌, పిల్లలు, పేరెంట్స్.. ఇలా అందరిని చూసుకుంటాను. మరో వైపు నా కెరీర్ ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాంటి సమయంలో ఎదో ఒక విషయం పై మనస్పర్థలు రావడం సహజం. లైఫ్ ఎవరికీ సాఫీగా ఉండదు. ఇది ఒక రోలర్‌కోస్టర్‌ లాంటిది. ఒక టైంలో నేను రాజీవ్‌తో ఉండడం లేదని, విడాకులు తీసుకున్నానని కూడా రాసేశారు. మేమిద్దరం కలిసి రీల్స్‌ చేస్తూ వీడియోలు పోస్ట్‌ చేసినా కూడా ‘ఏంటి మీరు ఇంకా కలిసే ఉన్నారా?, విడిపోలేదా?’ అని కామెంట్స్ పెట్టారు. వాటిని ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చారు సుమ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి