మాట్లాడే తీరు తప్పు.. ఇచ్చి పడేసిన నాగార్జున.. దెబ్బకు మొహం మాడిపోయిందిగా..!
పాత కంటెస్టెంట్స్, కొత్త ఇంటి సభ్యులతో బిగ్ బాస్ కళకళలాడుతోంది. పేరుకు తగ్గట్టుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం వైల్డ్ గానే ప్రవర్తిస్తున్నారు. పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. అలా ఆరో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ 9 మంచి రసవత్తరంగా సాగుతుంది. గొడవలు, టాస్క్ లు, ఏడుపులు, ఎమోషనల్ సీన్స్ అబ్బో.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కొత్త కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ డబుల్ అయ్యింది. ఇక ఈ వారాం వారం ఒకొక్కరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. అలాగే లాస్ట్ వీక్ ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఎవరు బయటకు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోలో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున హౌస్ లో ఉన్నవారికి ఓ రేంజ్ లోక్ క్లాస్ తీసుకున్నారని చూపించారు. ముందుగా మాధురి, కళ్యాణ్ కు మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడారు నాగ్.
కొత్తగా వచ్చిన వారిని కిరీటాలు పెట్టి వాళ్లకు అర్హత ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత ఆడియన్స్ కు ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి వారితో కూడా ఓట్లు వేయించారు. మధురిని లేపారు నాగ్.. సుమన్ శెట్టిని లేపి కళ్యాణ్ కు, మాధురికి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అని అడిగాడు. దానికి సుమన్ మాధురిగారిది అని చెప్పాడు. దాంతో ఒక్కసారి వీడియో ప్లే చేసి చూపించారు నాగ్. ఆతర్వాత మాధురి డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది. దానికి మాట్లాడింది కరెక్టే.. కానీ మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఆడియన్స్ కు ఓటింగ్ చేయించగా.. 60మంది మాధురిదే తప్పు అని చెప్పారు. దాంతో హౌస్ లో ఉన్న షీల్డ్ నుంచి ఆమె పవర్ స్టోన్ ను తీసేసారు. అలా ఒకొక్కరిని లేపి అడిగారు.
నాగార్జున అయేషా దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ ఉంది.. దాంతో ఆమెకి కిరీటం పెట్టి తనుజను ఆమె అర్హురాలా కాదా అని అడిగారు నాగ్. దాంతో ఆమె డిజర్వ్ అని చెప్పింది.. రావడమే ఆమె ఓ రావడమే ఒక టార్గెట్ తో వచ్చింది. అనగానే ఆమె టార్గెట్ చేసింది నిన్నేగా అని కౌంటర్ వేశారు నాగ్. ఆతర్వాత రీతూని లేపి అడగ్గా..ముందు డిజర్వ్ అంది.. ఆతర్వాత నాగ్ క్లారిటీగా చెప్పి మరోసారి అడిగితే లేదు అని చెప్పింది. నిఖిల్ గురించి ఇమ్మాన్యుయేల్ ను అడిగారు నాగ్. అలాగే సాయి గురించి భరణిని అడిగారు. మొత్తంగా పాత వారికికాస్త గట్టిగానే ఇచ్చారు నాగ్. ఇక ఈ వారం హౌస్ నుంచి రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటింగ్ లో మనోడికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




