మీరు తోపు అయితే బయట చూసుకోండి.. ఇక్కడ కాదు.! మాధురికి ఇచ్చిపడేసిన నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 9లోకి కొత్త హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రచ్చ డబుల్ అయ్యింది. కొంతమంది గొడవలతోనే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది టాస్క్ ల్లో తమ సత్తా చాటుతున్నారు. శనివారం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకుంటుంటారు.

వారాంతం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున ఎంట్రీ ఇస్తారు. నాగార్జున వచ్చారంటే చాలు హౌస్ మేట్స్ గుండెల్లో దడపుడుతుంది. శనివారం వచ్చిందంటే చాలు నాగార్జున ఎవరికి క్లాస్ తీసుకుంటారో అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ వారం హౌస్ మేట్స్ కు నాగార్జున ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కింగ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత హౌస్ లో కొన్ని బోర్డ్స్ పెట్టి వాటిని ఒకొక్కరిని ఒక్కక్కరి మేడలో వేయమని ఆతర్వాత రీజన్ చెప్పామన్నారు నాగార్జున. ముందుగా రమ్యను లేపి బోర్డు వేయమన్నారు నాగ్.
రమ్య నువ్వు వచ్చి వారం రోజులే అయ్యింది.. కానీ హౌస్ మాత్రం 50రోజులు పూర్తి చేసుకుంది. నువ్వు ఒకరి మేడలో బోర్డు వెయ్యి అని చెప్పారు నాగార్జున. దాంతో ఆమె ఫేక్ బాండింగ్ అనే బోర్డును మాధురి మెడలో వేసింది. దాంతో రీజన్ అడిగారు నాగ్. దానికి రమ్య .. హౌస్ లోకి వచ్చిన మొదట్లో ఆమె ఎవరితోనూ బాండింగ్ పెట్టుకొను అని చెప్పారు. కానీ ఆమె ఇప్పుడు బాండింగ్స్ పెట్టుకుంటుంది. అది కూడా ఫేక్ గా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది రమ్య. దానికి మనసు మార్చుకొని ఉండొచ్చు కదా అని నాగ్ అడిగితే.. నాకైతే అలా అనిపించింది అని చెప్పింది రమ్య.
ఆతర్వాత పవన్ , కళ్యాణ్ మెడలో బోర్డు వేశాడు.. ఇమెచ్యూర్ అని బోర్డు వేశాడు పవన్. తెలిసో తెలియకో తప్పు చేస్తే దాన్ని అర్ధం చేసుకొని ఒప్పుకోవాలి కానీ కళ్యాణ్ అలా చేయడం లేదు అని చెప్పాడు పవన్. నామినేషన్ సమయంలో ఎవరిని నామినేట్ చేస్తన్నావ్.? అని నాగార్జున కళ్యాణ్ ను అడిగారు. దానికి తనూజ పేరు చెప్పాడు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు నాగ్. ఆతర్వాత రీతూ మాధురి మెడలో బోర్డు వేసి.. జుట్టుపట్టుకుని నెలకోసి కొడతా.. అది ఇది అంటూ చాలా మాటలు అనేసింది సార్ అని చెప్పింది. దానికి మాధురి నేను బయట ఇలా చేస్తే జుట్టుపట్టుకుని నేలకేసి కొట్టేదాన్ని అని అన్నాను సార్. హౌస్ లో కాదు అని సమాధానం చెప్పుకొచ్చింది. దానికి నాగ్ సీరియస్ అయ్యారు. మాధురి ఆఖరి సారి చెప్తున్నా నెల కేసి కొడతా.. తాట తీస్తా..తొక్కుతా ఇలాంటి వాడొద్దు అన్నారు. దానికి మాధురి ఎదో చెప్తుంటే.. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి.. బిగ్ బాస్ హౌస్ లో కాదు అని వార్నింగ్ ఇచ్చారు నాగ్.. ప్రోమో మాత్రం అదిరిపోయింది మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








