AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: తనను అల్లు అర్జున్‌తో పోల్చుకుంటూ పల్లవి ప్రశాంత్ పోస్ట్.. ‘ఓవరాక్షన్’ అంటూ ఫ్యాన్స్ ఫైర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రైతు బిడ్డ ట్యాగ్ తో హౌస్‌లోకి అడుగు పెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ నే ఎగరేసుకుపోయాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Pallavi Prashanth: తనను అల్లు అర్జున్‌తో పోల్చుకుంటూ పల్లవి ప్రశాంత్ పోస్ట్.. 'ఓవరాక్షన్' అంటూ ఫ్యాన్స్ ఫైర్
Pallavi Prashanth
Basha Shek
|

Updated on: Dec 17, 2024 | 7:28 PM

Share

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ 11 గా ఉన్న బన్నీని హడావిడిగా అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రిలీజయ్యాడు ఐకాన్ స్టార్. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. సోషల్ మీడియా వేదికగా బన్నీకి సంఘీభావం తెలిపారు. ఇదే క్రమంలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఒక పోస్ట్ పెట్టాడు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. దీంతో బన్నీ అభిమానులు ఈ రైతు బిడ్డపై కాలు దువ్వుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల పాటు చంచల్ గూడ జైలులో ఉంచారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో బయటకు వచ్చాడు. ఇప్పుడు దీనిని మరోసారి గుర్తుకు చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ని తన అరెస్ట్‌తో కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు రైతు బిడ్డ. దీనికి ఏకంగా ఇండియన్ హీరోస్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రైతు బిడ్డపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా బన్నీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘కొంచెం ఓవర్ అయ్యింది బ్రో.. అల్లు అర్జున్ తో పోలీకేంటి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పల్లవి ప్రశాంత్ ఇన్ స్టా గ్రామ్ స్టోరీ పోస్ట్..

Pallavi Prashanth Post

Pallavi Prashanth Post

ఈ పోస్ట్ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అన్నదాతలకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. ‘ఎనిమిదో సీజన్ కూడా అయిపోయింది కదా బ్రో.. రైతులకు ఇస్తానన్నా డబ్బులేవి’అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిక పల్లవి ప్రశాంత్ ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా కేక్ కటింగ్ చేస్తోన్నపల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.