AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2024: సర్ ప్రైజ్ చేసిన చిన్న సినిమాలు.. ఉలిక్కి పడ్డ బాలీవుడ్

2024లో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద సర్‌ ప్రైజ్‌ సక్సెస్లు చాలా ఉన్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చి సక్సెస్‌ అయిన సినిమాలతో పాటు ఎలాంటి ఎక్స్‌ పెక్టేషన్స్‌ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్‌ హిట్ అయిన చిన్న సినిమాలు కూడా ఈ ఏడాదిలో చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ లో చిన్న సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి.

Year Ender 2024: సర్ ప్రైజ్ చేసిన చిన్న సినిమాలు.. ఉలిక్కి పడ్డ బాలీవుడ్
Tollywood
Satish Reddy Jadda
| Edited By: Rajeev Rayala|

Updated on: Dec 17, 2024 | 7:21 PM

Share

ఈ ఇయర్ ఇండియన్ ఆడియన్స్‌ ను సర్‌ ప్రైజ్ చేసిన బిగ్ హిట్ మూవీ హనుమాన్‌. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ ఫాంటసీ సినిమా నేషనల్ లెవల్‌ లో బిగ్ హిట్ అయ్యింది. ముందు నుంచి పాన్ ఇండియా ప్లానింగ్‌ తోనే బరిలో దిగినా కాస్టింగ్‌, స్టార్ ఇమేజ్‌ పరంగా పెద్దగా అంచనాలు లేకపోవటంతో హనుమాన్ సక్సెస్‌ ఇండస్ట్రీ జనాలను సర్‌ ప్రైజ్ చేసింది. స్లో అండ్ స్టడీ అన్నట్టుగా నెమ్మదిగా మొదలైన హనుమాన్ జోరు వెండితెర మీద చాలా కాలం కొనసాగింది. కేవలం 40 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్‌ రన్‌ లో 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్‌ చిన్న సినిమాలు కూడా పెద్ద కల కనొచ్చన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఏడాది అందరినీ సర్‌ ప్రైజ్‌ చేసిన మరో చిన్న సినిమా క. కిరణ్ అబ్బవరం హీరోగా స్వయంగా నిర్మించిన ఈ థ్రిల్లర్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌ లో బిగ్ హిట్ అయ్యింది. ముందు తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమాను కాస్త ఆలస్యంగా నేషనల్ మార్కెట్‌ లో రిలీజ్ చేశారు. ప్రమోషన్ విషయంలో కిరణ్ తీసుకున్న కేర్‌, సినిమా క్లైమాక్స్‌ లో షాక్ ఇచ్చిన ట్విస్ట్‌తో క సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ గా నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌ లో తన సత్తా చూపించారు కిరణ్‌ అబ్బవరం.

ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!

రీసెంట్‌ టైమ్స్‌ లో నేషనల్‌ లెవల్‌ లో అలరించిన మరో మూవీ లక్కీ భాస్కర్‌. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవల్‌ లో మంచి సక్సెస్ సాధించింది. ప్రమోషన్ విషయంలో పాన్ ఇండియా రేంజ్‌ హడావిడి చేయకపోయినా.. కంటెంట్‌ తో ఆ స్థాయిలో ప్రూవ్ చేసుకుంది లక్కీ భాస్కర్ టీమ్. పెద్దగా అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమాలు కూడా నేషనల్ మార్కెట్‌ లో సత్తా చాటడంతో నార్త్ మేకర్స్ షాక్ అవుతున్నారు. సౌత్ సినిమా రూలింగ్‌ ను చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉంది బాలీవుడ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.