Pallavi Prashanth: అమ్మకు నెక్లెస్.. తండ్రికి లగ్జరీ కారు.. గిఫ్ట్‌గా ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. వీడియో ఇదిగో

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగిసి సుమారు అరునెలలు అవుతుంది. అప్పుడే ఎనిమిదో సీజన్ సన్నాహకాలు కూడా మొదలయ్యాయి. కంటెస్టెంట్ల కోసం వేగ కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే 'రైతు బిడ్డ ' ట్యాగ్ తో ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ మాత్రం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడని నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.

Pallavi Prashanth: అమ్మకు నెక్లెస్.. తండ్రికి లగ్జరీ కారు.. గిఫ్ట్‌గా ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. వీడియో ఇదిగో
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Jun 01, 2024 | 4:37 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగిసి సుమారు అరునెలలు అవుతుంది. అప్పుడే ఎనిమిదో సీజన్ సన్నాహకాలు కూడా మొదలయ్యాయి. కంటెస్టెంట్ల కోసం వేగ కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే ‘రైతు బిడ్డ ‘ ట్యాగ్ తో ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ మాత్రం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడని నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. ఇచ్చిన మాటను గట్టు మీద పెట్టేసి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీ షోలతో పల్లవి ప్రశాంత్ తీరిక లేనంత బిజీగా మారిపోయాడంటున్నారు. వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు సుమారు రూ. 35 లక్షల నగదు బహుమతి వచ్చింది. అలాగే రూ. 15 లక్షల విలువైన మారుతి సుజుకీ బ్రీజా కారు, అంతే ఖరీదైన నెక్లెస్ కూడా గిఫ్ట్ గా వచ్చాయి. అయితే ఈ బహుమతులు పల్లవి ప్రశాంత్ కి వెంటనే అందలేదు. షో ముగిసిన ఐదు నెలలకు అంటే ఇటీవలే రైతుబిడ్డకు ఈ బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతనే తెలియజేశాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే తాజాగా పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ లగ్జరీ కారు కొన్నాడు. మారుతీ సుజుకీ చెందిన రెడ్ కలర్ ఓపెన్ టాప్ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం తన బిగ్ బాస్ గురువు శివాజీని షో రూమ్ కు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా కుడి కాలు పెట్టి శివాజీ మొదటి డ్రైవ్ చేశాడు. ఇక ముందు సీట్ లో పల్లవి ప్రశాంత్ తండ్రి కోర్చోగా, డ్రైవింగ్ సీట్ లో శివన్న.. వెనుక పల్లవి ప్రశాంత్ కూర్చున్నారు. . దీనికి సంబందించిన వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘ బాపూ కోసమే ఈ కార్. బిగ్ బాస్ కు, అలాగే నాగ్ సార్, మారుతీ సుజుకీ కి ప్రత్యేక అభినందనలు. నన్ను గెలిపించిన అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని ఈ వీడియోలో రాసుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు.. రైతులకు డబ్బులు పంచుతానని చెప్పి పూర్తిగా నువ్వే వాడుకుంటున్నవా అని కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరు అది బిగ్ బాస్ ఇచ్చిన బహుమతి అని గుర్తుచేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.